Jump to content

పుట:Bhagira Loya.djvu/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొమ్మలరాణి

"అయితే, తమరు మా యింటికి తమ ఇష్టము వచ్చినప్పుడు దయచేయొచ్చునే."

"అయిదు పాఠాలు రోజంతా తీసుకుంటున్నాయి."

సీతారామయ్యగారు చిరునవ్వు నవ్వుకున్నాడు.

"మీ దీక్ష నాకు సంతోషం కలుగజేస్తున్నదండి."

"నాది ఆరోపాఠం. తమ ఇంటికే వచ్చి నేర్చుకుంటాను. తమ సేవ చెయ్యడానికి నా కీ సావకాశం ఇవ్వండి."

"మీరు ఉద్యోగానికి వెడుతారే!"

"అసలు ఉద్యోగానికే వెళ్ళను. ఒకవేళ వెడితే అంతవరకే చెప్పండి. నా అదృష్టం అంతే అనుకుంటాను. ఇక అభ్యంతరాలు చెప్పకండి. సంగీతహృదయం లోకి నన్ను చొచ్చి పోనివ్వండి. మిమ్మల్ని వదలను. మీ ఇంటికి వచ్చే నేర్చుకుంటాను. మంచి ముహూర్తం చూసి తమ రెప్పుడు రమ్మంటే అప్పటి నుంచి తమ దగ్గిర శిశ్రూష ప్రారంభిస్తాను," అని కామేశ్వర్రావు చేతులు జోడించినాడు.

"అయ్యయ్యో, అదేమిటి కామేశ్వరరావుగారూ," అని ఆయన కామేశ్వరరావు చేతులు పట్టుకున్నాడు.

5

కామేశ్వర్రావుపాఠం సాయంత్రం ఏడింటికి మొదలు పెట్టి ఏడున్నరకు పూర్తిజేసేవారు. ఆతను మహాదీక్షగా నేర్చుకుంటున్నాడు. అంచేతనే అందరికి గంట చెప్పేపద్ధతి

67