పుట:Bhagira Loya.djvu/67

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
'బాపిరాజు'
 

కామేశ్వర్రావుగారూ, రెండు నెలల్నుంచి నా ఫిడేలు వినడానికి రావటం లేదే?"

"ఇదివరకు మీతో అంటూవచ్చాను గాని నా యమ్. ఎ. చదువుకీ సంగీతానికీ పడదని తమ శిష్యుణ్ణి కాలేదు. నాకు సంగీతం నేర్పడం మీరు మొదలెట్టాలని నామనవి."

"నాకు ప్రస్తుతం అయిదు పెద్ద పాఠా లున్నాయండీ. పొద్దున్న, రాత్రి ఇంటిదగ్గిర కుఱ్ఱాళ్లకి చెప్పాలి. తక్కిన కాలంలో ఈ అయిదుపాఠాలు సరిపోతాయి. బాబూ, నన్ను క్షమించాలి."

"యెల్లాగో తీరిక చేసుకుని మీ యింటిదగ్గరే నాకు ఆరో పాఠంగా నేర్పాలి. మీరే రెండుమూడుసార్లు నా గొంతుక మంచిది, సంగీతం నేర్చుకోమన్నారు."

"మీబోటివాళ్ళు మా ఇంటికి రావడమే!"

"నన్ను సంగీతం నేర్చుకో వద్దంటారా?"

"అయ్యయ్యొ! యెంతమాటంటారూ ! మీబోటి ఉత్తములకు సంగీతం నేర్పకపోతే నా విద్యెందుకండీ!"

"ఇన్నాళ్లూ ఈ చదువులతో కాలం వృథాపుచ్చాను. ఈ నాటికి నా కీ సత్సంకల్పం కలిగింది. సంగీతం విని ఆనందించేందుకైనా నేర్చుకోవాలని ఉంది."

"మీరు మా ఇంటికి రావడం నా మనస్సు ఒప్పదండీ."

66