Jump to content

పుట:Bhagira Loya.djvu/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

అద్దంకి వారి ముద్దు గొంతుక, కపిలవాయి వారి గంగా ప్రవాహం, జొన్నవిత్తుల వారి కిన్నెర కంఠం, సి. యన్. ఆర్. చిన్నారి పొన్నారి పాటలు, తుంగలవారి గమకభంగిమాలు బాలగంధర్వుని పరమ గాంధర్వం, నారాయణరావు వ్యాస జీవగీతాలు, పెందార్కర్ వుద్దండ సంగీతం మురిసిపోయి, సొక్కి, కన్ను లరమూతలేసి ఆనందంలో వూగిపోయ్యేవాడు.

కాని సంప్రదాయసిద్ధమైన త్యాగరాయాదుల పాటలు, రాగాలాపనలు, రాగమాలాప్రవాహాలు అంటే అతనికి తలనొప్పి.

ఆ నాడు రాత్రి తోలుబొమ్మలాటలో సమ్మోహనాస్త్ర తుల్యమైన ఆ బాలికాకంఠం విన్నప్పుడే నెమ్మదిగా ఇంటికిపోయి అయిదురూపాయలనోటు పట్టుకొచ్చి తోలుబొమ్మల పందిరి వెనక్కి వెళ్ళి వీరయ్యని ఈవలికి పిలిచి 'నీ మనవరాలి గొంతుక్కి ఇదిగోరా బహుమానం' అని ఇచ్చాడు. ఆ తక్షణము వీరయ్య కథ ఆపుచేసి తెరమీద బొమ్మనెక్కించి 'మరీమరీ కామేశ్వర్రావుగారూ' అని పొగిడాడు. గొప్ప ప్రభువులకు చూపించే మంచిబొమ్మలు తెరమీద కెక్కించాడు.

ఆ నాటి నుంచీ కామేశ్వర్రావుకు మీనాక్షి కంఠము సర్వకాలము ప్రతిధ్వనిస్తూనే వున్నది.

ఆ బాలిక కొంచెము చామనఛాయ. నవయౌవనము పరిమళిస్తూ వున్న పొంకాల రేఖలు సుడులు తిరిగి కరిగి

64