బొమ్మలరాణి
కామేశ్వర్రావు రసపిసాసి కావడంచేత కళా హృదయానికి సంపూర్ణంగా వ్యతిరేకమైనటువంటి 'సేవ' అనే పదార్థము ఆతనికి యెల్లా ఆవేశం కలగ జేస్తుంది? ఆతని మనఃపథాలల్లో డ్రాయరుబల్ల, ప్రక్కని కాగితాలపెట్టి, బీరువా, కాగితాలకట్ట దొంతరలు ఇవి చిత్రలేఖానికీ, శిల్పానికీ వ్యతిరేకమైన అడ్డుగీత లని అనుకుంటాడు.
"ఆ కాగితాలు యెందుకు పంపించవు? ఈ విషయం మీద నోటు పంపించవేమీ? అనేమాటలు గాంధర్వ మహాకళకు అపశ్రుతులని తలుస్తాడు.
పై వారికి కిందవారికి పంపించే విజ్ఞాపనలు, తాఖీదులు కవిత్వం అవుతాయా అని పృచ్ఛ చేసుకుంటాడు.
ఏలాగున ఆతడు ఉద్యోగాలకి ప్రయత్నించగలడు?
కామేశ్వరరావుకు సంగీతమంటే పరమప్రాణం. కవిత్వమంటే చెవికోసుకుంటాడు. చిత్రలేఖనం, శిల్పం చూసి మురిసిపోతాడు. కళారసజ్ఞుడు. కాని ఒక్క కళలోనూ ప్రవేశం లేదు. గొంతుక కొంచెం బాగుంటుంది. అంచేత దేవులపల్లి వారి దేవాలయం దగ్గిరికీ, నండూరివారి నాయుడు గ్రామానికీ, చింతావారి పుణ్యక్షేత్రానికీ, కవికొండలవారి వికసితోత్పల దగ్గిరికీ, విశ్వనాధవారి కిన్నెరవాగులకీ, ముద్దుకృష్ణుని మురళీ జ్వాలల దగ్గిరికీ, తీర్థయాత్రలు చేస్తూ, వరుసలు నేర్చుకుంటూ వస్తూ వుంటాడు. గ్రామఫోనుపాటలు చాలా బాగా వచ్చును. స్థానం వారి స్థాయీ మార్పు విలాసాలకు మురిసిపోతాడు.
63