'బాపిరాజు'
లోను, కార్వేటినగర సంస్థానంలోను, గద్వాలు సంస్థానంలోను వీరయ్యకు మూడు బంగారపు కడియాలు బహుమతులు వచ్చాయి. విజయనగరం మహారాజాగారు నూటయాభై రూపాయల శాలువానూ, నూటపదహారు రూపాయలు రొఖ్కమునూ బహుమతీ యిచ్చారు. నూజివీడు కోటలో వెండిజరీ పగిడీ, అయిదు కాసుల కంఠహారం, దోసెడురూపాయలు, ఒక ఎకరం ఇనాము యిచ్చారు.
2
పూర్వకాలంలో వీరయ్య సంపాదన దోసిళ్లకొద్దీ ఉండేది. సత్తెనపల్లిలో పదియెకరాల మాగాణిభూమి కొనుక్కున్నాడు. అయిదారుచోట్ల నాలుగువేలరూపాయలు వడ్డీ వ్యాపారానికి వేసుకున్నాడు. నేడు తోలుబొమ్మల్ని ఆదరించే వాళ్లు లేరు. మేరీఫిక్‌ఫర్డు, గ్రేటాగార్బో, నార్మా షీరరు, డగ్లసు మొదలగువాళ్ళు గమ్మత్తులు చేసే యీ రోజుల్లో తోలుబొమ్మలను ఆదరించే వాళ్లెవరు? ఐనా నాగరకత యింకా పూర్తిగా పాటకజనాన్ని ఆవహించ లేదు. వాళ్లని సరస్వతీమాత రక్షించాలి. తోలుబొమ్మలు చూసినా, యక్షగానాల్ని ఆదరించినా, బుర్రకథల వాళ్లని, దేవరకథలవాళ్లని, వీధి భాగవతుల్ని పోషించినా వాళ్లే యింకా.
వీరయ్యజట్టంటే ఇప్పటికీ పూర్వకాలపు వాసనలు పూర్తిగా పోని విద్యావంతులకు గౌరవమే. ఈ రోజున
56