బొమ్మలరాణి
వున్న పద్యాలన్నీ చదివారు. సరస్వతీదేవి పటమున్నూ మాయమైంది. మళ్ళీ వెనకటి వానర విగ్రహం వచ్చింది.
ఈ గుంపు చాల విద్వత్తుకల గుంపు. గుంపు పెద్ద వీరయ్య డెబ్బదిఏళ్ళ వాడైనా కంఠం గంభీరమంద్రంలో మంద్రంలో తెల్లటి జీడిపప్పు పాకంలా మా తియ్యగా సాగుతుంది. మంచి విద్యావంతుడు. వాల్మీకి రామాయణం, భాస్కర రామాయణం, సంస్కృత మహభారతం, నన్నయ తిక్కన ఎఱ్ఱాప్రెగ్గడల మహాభారతం ఆతనికి కంఠస్థం. మంచి నీళ్లప్రాయం. అమరం అనర్గళధార. ఒక్కొక్క కథకు నాలుగైదు తోలుబొమ్మ యక్షగానాలు అద్భుతంగా వచ్చును. సంగీతశాస్త్రం ప్రసిద్ధికెక్కిన కోన సుబ్రహ్మణ్యశాస్త్రిగారి దగ్గిర నిరాఘాటంగా నేర్చుకున్నాడు.
ఆతని కుమారుడు విఠలుడూ, విఠలుని ఇద్దరు భార్యలు నాంచారీ, రుక్మణీన్ని, విఠలుడి కొడుకు ఓబలయ్యా, వాడి తమ్ముడు బేట్రయ్య, విఠలుని కూతురు మీనాక్షి - ఈ ఏడుగురు ఆటలో పాలుగొనే జట్టు. తోలుబొమ్మలవాళ్ల ఆచారం ప్రకారం మొగవాళ్లూ, ఆడవాళ్ళూకూడా మద్దెల వాయించడం తిత్తివూదడం నేర్చుకోవాలి.
వీరయ్యకు గొంతు తొణకనన్నా తొణకదు. వీరయ్య కుమారునికీ, మనుమలకీ, కోడళ్లకీ, మనుమరాలికీ బొమ్మలు తయారుచేయడం వచ్చును. వీరయ్య తోలుబొమ్మల వాళ్లందరిలోను శిల్పసార్వభౌముడు. వెంకటగిరి సంస్థానం
55