పుట:Bhagira Loya.djvu/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
భోగీరలోయ
 

6

ఈ బాలికాహృదయతత్వం నాకు అర్థంకాలేదు. ఈమె జీవితమే నాకు కొత్త అయినది. ఈమె తక్కిన స్త్రీల కన్న వేరా? ఇక్ష్వాకురాజవంశజ అయిన ఆనాటి ఆ బాలిక అందము ఆడుపులి అందము. ఇది వెన్నెల రేఖ. వెన్నెలలోని శిరీషకుసుమము. పాల వెల్లువ తరగ ఈమె అందంలో యేమి వంక వున్నది? నిజముగా ఈమె హృదయం పవిత్రమైనది. ఓహో! కల్హారమాలికయా ఈమె?

ఈ బాలిక నన్ను విడిచి ఒక్క క్షణం వుండదు. ఆమె స్వయంగా పచనం చేసి విచిత్రరుచుల భోజనము కొనివచ్చేది. నా పాదసంవాహనం చేయ సిద్ధపడిన నాడు ఆమె నా పాదాల స్పృశించి నప్పుడు నాలో విద్యుల్లతికలు అలుముకు పోయినవి. ఆమెను నా కౌగిలిలో అదిమివేయక ఏలాగు నిగ్రహించుకోగలను? నేను అధఃపతితుడను కావడం లేదు గదా?

ఆమె పెదవులు జేగుర్లునిండి అతిలలితాలైన చిగుళ్లు. ఆమె కళ్లు యెంత పవిత్ర కాంతుల్ని సేకరించుకొన్నవి! స్వచ్ఛమైన కదలికలేని చెరువు నీటిలో ప్రతిఫలించిన తారకాకాంతు లవి.

ఆమె అందము నిర్మల నీలాకాశంలో తేలిపోయే తెల్లని పక్షి. ఆమె అందము ఆ పక్షి గొంతుకలోంచి విడిపోయి ఆ నీలంలో తొణికిసలాడే పాట, ఆమె అందము

27