పుట:Bhagira Loya.djvu/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
భోగీరలోయ
 

“పరమదేవుడైన మహాశ్రమణకుని గొప్ప భక్తుడే.”

“చిత్తం? ఆతడు ఇక్ష్వాకు రాజకుమారి నొకర్తెను ప్రేమించాడు. ఆమె అతని దివ్యప్రేమను గౌరవించి తిరిగి ప్రేమించినట్లు అభినయించింది.”

“ప్రేమించనే లేదా యేమిటి?”

“స్వామీ! ఆమె శుష్కహృదయ, వృథాడంబరం కలిగిన విచిత్రస్వరూపమైన శూన్య జీమూతం వంటిది. అతని ప్రేమ లోకాల నావరించింది. ఆమె అంతకన్న అనంతమైన ప్రేమలో ఆతన్ని ముంచివేస్తున్నట్లు నటించింది.”

“ఏ మా వెఱ్ఱి ఆ బాలికకు?”

“స్వామీ! స్త్రీ హృదయం యెవ్వరు యెరుగగలరు? రాజబంధువైన ఆమె తండ్రిని ఆమె పాణిగ్రహణానికై ఆ శిల్పి యాచించాడు. తండ్రి సంతోషముతో అనుమతి యిచ్చాడు. కాని కపట నటనానటి, కర్కశహృదయమైన ఆ బాలిక ‘నే నేమిటి! ఈతనిని పెండ్లి చేసికోవట మేమి’టని వెడనవ్వు నవ్వింది. ఆ శిల్పి హృదయంలో చీకటి ఆవరించుకుంది. భయంకరమైన తుఫానుమబ్బులు పట్టినవి. దావానలం అడవుల్ని మండించినప్పుడు వుద్భవించే పొగ అతని జీవితాన్ని క్రమ్మివేసింది. ఆతనికి దైవం లేడు, బుద్ధుడు లేడు, ధర్మం లేదు, ప్రేమ లేదు.”

“ఎంత వెఱ్ఱివాడై పోయినాడు!”

“వెఱ్ఱివాడు కాదు స్వామీ! సర్వజ్ఞానమూ నశించి పోయిన పిచ్చివా డయిపోయినాడు. ఆతని జీవితంలోని

13