పుట:Bhagira Loya.djvu/127

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
'బాపిరాజు'
 


"ఆ అది ఏమిటి? అయితే సూర్యనారాయణరావు- ఆ రాగిసెమ్మా ఎక్కడిదోయి?" అని అడిగాడు మెరిసిపోయే కళ్లతో మా నాన్న.

"చెన్నపట్టణంలో విక్టోరియా మందిరంలో కొన్నాను"

"ఈ సెమ్మా మాది సుమా"

"ఆహా ఏలా వెళ్లిందక్కడకు?"

అక్కణ్ణుంచి తంతివార్తల్తో విచారణ జరిపించ చివరకు ఒక పప్పు మిఠాయి అమ్మేవాడికి మా యింటి కాపలా కుర్రాడు అమ్మినట్టు. అది వాడు రాజమండ్రిలో కంచర దుకాణానికి అమ్మినట్టు, వాళ్ల దగ్గర ఒక గుమాస్తా కొని విక్టోరియా మందిరం వాళ్ల కమ్మినట్టు తేలింది.

ఆ సెమ్మా నా ప్రాణము, నా ఆత్మ లాగేసింది. ఆ అమ్మాయి మా యింటికి కాపురానికి వచ్చేటప్పుడు ఆ రాగి సెమ్మా పట్టుకొనే వచ్చింది.

మా తండ్రిగారు దేవతార్చన రోజూ చేస్తారు. నా ప్రియపత్ని, దీపం కాంతులు బంగారు మోమునకు అద్భుతమైన తేజం యివ్వగా, ఆ దీపం బమిడిపత్తి వత్తులతో రోజూ ఉదయాన్నే మడి గట్టుకొని వెలిగిస్తూ వుంటూంది.

126