పుట:Bhagira Loya.djvu/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జగ్గన్నగంటం

నాగమనీడు ప్రభువు సైన్యాలలో వీరులైన దివిసీమ కాపువారు, యమునినైనా నిలబెట్టగల కమ్మనాటి రెడ్లు విరివిగా వచ్చి చేరుతున్నారు. దేవరకోట మహాపురంలో కమ్మర కొలుముల్లో ఉక్కు కత్తులు, కరవాలాలు, భిండివాలాలు, బల్లాలు, శూలాలు, తోమరాలు రాత్రింబవళ్లు ఎడతెరిపి లేకుండా తయారవుతున్నాయి. మచిలీపట్టణంలో వర్తకం చేసుకొనే ఒలాందులు నాగమనీడు ప్రభువు పంపించిన బంగారపు టంకాలు తీసుకొని తుపాకులు, ఫిరంగులు, తుపాకిమందు, ఉక్కుసామగ్రి సరఫరా చేసినారు. ఏబది ఒలాందు సైనికులును ఒక చిన్న ఒలాందు నాయకుని శిక్షణ క్రింద వచ్చి నాగమనీని సైన్యంలో చేరారు.

నాగమనీడు ప్రభువుకు తన క్రింద దళవాయిగా వుండటాని కెవరి నేర్పాటు చేద్దామా అన్న ప్రశ్న ఉదయించింది. ప్రశ్నతో పాటే కడలి రామన్న మంత్రి మూర్తిన్నీ ఆయన కళ్ళ యెదుట ప్రత్యక్ష మయింది. రామన్న మంత్రి ముసలి వాడైనా భీష్ముని వలె ఉద్ధత సత్వుడు. ద్రోణుని మరిపించే యుద్ధవ్యాపార నిపుణుడు. వెనుక బుడతకీచు దొంగలు (పోర్చుగీసు) కొందరు అరబ్బీ ఓడ దొంగలతో కూడి కృష్ణానదీ ముఖద్వారంలో దిగి దేవరకోట సంస్థానంలోకి చొచ్చుకొని వచ్చి కడలి పురాన్ని ముట్టడించబోయే ముందర, రామన్న మంత్రి ఊళ్లోవున్న కమ్మనాటి రెడ్లవీరుల్నీ, కాపువీరుల్నీ, అశ్వత్థామలా వీరత్వం వహించిన బ్రాహ్మణ వీరుల్నీ, చిన్నదళంగా నేర్పరచుకొని తమ కడ్డమొస్తుందని

107