పుట:Bhagira Loya.djvu/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జగ్గన్నగంటం

తన పెద్ద కుమారునికి భ్రమరాంబను యివ్వవలసిందిగా మనకు రాయబారం పంపిద్దామని అనుకుంటున్నారని గొఱ్ఱెవాడి పెద నాగేశ్వరరెడ్డి, రాజపురోహితుడు వేమూరి శ్రీరంగభొట్ట సోమయాజులువారును మొన్న సందేశం తీసుకొని వచ్చారు. అమ్మాయికి పదవ ఏడైనా పంచకావ్యాలు చదువుకుంది. అందాల బరిణె. దాని అదృష్టం యెట్లా వుందో.

జగ్గన్న -- దేశపరిస్థితులు మేఘా లావరించినట్లున్నాయి బాబయ్యగారు. అవి రక్తమేఘాలు. రాజుల్లో రాజ్యకాంక్ష యెక్కువయింది. బలములు తక్కువయ్యాయి. బుడతగీచులు, వాళ్ళు యెక్కడ్నుంచి వస్తున్నారో, సముద్రాల అవతల నుంచో, సముద్రం క్రింద పాతాళం నుంచో, వర్తక మనీ, వల్లంకు లనీ, వచ్చి రాజులకూ రాజులకూ కొప్పులు ముడి పెడుతున్నారు. ధర్మం లేదు. ప్రజల క్షేమం లేదు - ప్రభువుల హృదయాలల్లో.

రామన్న -- ఒక్క మన నాగమనీడు ప్రభువు యార్లగడ్డ వంశానికే కాకుండా, కమ్మనాటి రెడ్ల వంశాలన్నిటికీ గూడా కీర్తి తెస్తున్నాడు. తన ప్రభువు రఘునాధ భూపాలునితో పాటు కావ్యకర్త అవుదా మని ఆలోచిస్తున్నాడు. పండితాదరణ, కళారాధన కలిగియుండడమే కాకుండా ప్రజలను తన బిడ్డల్లా రక్షించుకొంటున్నాడు. ఒక్క బందిపోటు యెరగం. రెండేళ్ల క్రింద వచ్చిన చిన్న క్షామాన్ని భూమిలో మూడు నిలువులా పాతి, ప్రతియింటా దీపాలు వెలిగింపించి పండగలు చేయించిన ప్రభు వతడు.

105