'బాపిరాజు'
3
తండ్రి -- నాయనా ! ఈ ఏటి పంట అంత నాశిగా లేదు బాబు.
జగ్గన -- కందులు, సెనగలు, పెసలు, మిర్చి యింత పుష్కలంగా అవతరించడానికి కృష్ణవేణమ్మ దయే కారణం.
రామన్న మంత్రి -- దేశంలో మళ్ళీ పెద్ద యుద్ధం సంభవించే సూచనలు కనబడుతూ వున్నవి. ఆంధ్ర సార్వభౌములు శ్రీరంగరాయలని, పెనుగొండలో రాక్షసుడైన జగ్గరాయలు హతమార్చి నప్పటి నుంచి మన మహారాజైన రఘునాధభూపాలుడు వుడుకెత్తిపోతున్నా డని వేగు వచ్చినట్లు దేవరకోటలో గగ్గోలుమంది. శ్రీమంతులు, ప్రభువులు నాగమనీడులం వారు ఏ సమయానకు రాణువుతో బయలుదేరి రమ్మని తంజావూరు నుంచి రఘునాధనాయనిం వారి ఆజ్ఞ వస్తుందో అని యెదురు చూస్తున్నారు.
జగ్గన్న -- నాకూ హృదయంలో ఆందోళనంగావుంది. బాబయ్యగారూ ! అధర్మం పరవళ్లు పెడుతూన్నది. ప్రభువు కృష్ణదేవరాయలు దివంగతుడయ్యాడు. దేశంలో భీభత్స దేవత తాండవం చేస్తూన్నది. దుర్గానాగేశ్వరదేవుని కృప యెల్లా వున్నదో.
రామ -- శ్రీ దుర్గాదేవి కరుణ వల్ల నాలుగో అమ్మాయి భ్రమరాంబ వివాహం యీ ఏడు చేయవలసి వుంటుందిరా. కోటలో రాయస మయిన అడివి మాచన్నగారు
104