పుట:Bhagira Loya.djvu/100

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
బొమ్మలరాణి
 

బెంగచే కృశించి తల్లి మంచముపట్టి వున్నది. ఇంతలో మెరుపుతీగలాంటి ఒక బాలిక ఆమె పాదాలకడ వ్రాలి, పాదాలపై తల వుంచి, పాదాలు పట్టుకున్నది. కామేశ్వర్రావు తల్లి నెమ్మదిగా లేచి "యెవరమ్మా నువ్వూ?" అని ఆ బాలిక తలపట్టుకొని యెత్తి మోము తేరిపారచూచింది.

"నువ్వెవరు, తల్లీ?"

ఆ బాలిక కన్నుల జలజల బిందులు రాలిపోతున్నవి.

"నువ్వు దేవతాకన్నెవు కాదుగదా?"

వర్షం కురుస్తూన్నపుడు వచ్చే వెన్నెలలా ఆ బాలిక పెదవులు నవ్వాయి.

కామేశ్వర్రావు తల్లి "నా బంగారుతల్లి, నువ్వెవరో తెలియలేదు నాకు" అని ఆ బాలికని దగ్గరకు లాగుకొని హృదయానికి అదుముకున్నది.

ఇంతలో గుమ్మముకడ నిలుచునివున్న కామేశ్వర్రావు

"అమ్మా! మీ ఆజ్ఞలేకుండా సంచరించిన ఈ అధముణ్ణి క్షమించి మా ఇద్దర్నీ దీవించవూ?" అన్నాడు.

ఆవిడకు హృదయం పొంగింది.

"నాయనా! ఈ దేవకన్నేనా నా కోడలు? బొమ్మలాట వాళ్ళ పిల్లంటే యానాదుల అమ్మాయి లా వుంటుందనుకున్నాను. ఈమె శాపం చేత పుట్టిన ఇంద్రుడు కూతురు రా!"

99