పుట:Bhaarata arthashaastramu (1958).pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ విషయముననే బాధ యెక్కువ యౌననియు నాకారణమున వస్తువునం దాసక్తి తగ్గుననియు జెప్పవచ్చును. అనగా విరక్తియే ఆసక్తి వదలుటకు గారణమనియు ప్రయాసమువలని వేదనయు విరక్తిని బుట్టించు కారణములలో నొకటి యనియు దెలియ దగినది.

నాలుగుగంట లగుసరికి సుఖదు:ఖములు సమానములౌను. ఇంక నెక్కువకాలము పాటుపడియెనేని మితమునకు మీఱినంత సిద్ధి సమకూరుగాన అభిరుచి కొద్దియౌను, శ్రమ (క్లేశము) యుక్తప్రయోజనము లభించునను నాసలేమి దుర్భరమగును. కావున నాల్గు గంటలకన్న నిట్టిస్థితిలో నెఱుకగలవాడు పనిజేయడు.

మూల్యము అంత్యప్రయోజనముతో సంబంధించినది. అంత్యప్రయోజనము ఫలరాశి ననుగమించి యుండును. రాశి వాంఛా శ్రమలచే నిర్ణయింపబడును. వాంఛాశ్రమములును అన్యోన్య సంబంధము కలవిగా నున్నవి. కావున మూల్యము, రాశి, ఉపయుక్తి, క్రమ, యను నీనాల్గును పరస్పరాధారములనియు, నన్యోన్య నిర్ణీతములనియు నెఱుగునది. అర్థంబును త్రాటియందుండు పిరులు ఈనాలుగు.

రాశి ననుసరించి మూల్యమేర్పడుననుట స్పష్టమేయయినను మూల్యముచే రాశి నిర్ణయింపబడునని పైన సూచనగ దెలిపితిరి గదా! ఇదియెట్లు? అని ప్రశ్నింతురేమో. వినుండు. వెల యధిక మయినచో నెక్కువగ నుత్పత్తి చేయుటకు కర్మకరులు కడంగుదురు గాదె! రూపాయకు నాలుగు పుట్లు అమ్ముకాలములో నూఱుపుట్లు పండించువాడు రూపాయకు రెండుపుట్లు వెలయగునని ముందుగా దెలిసికొన్నవాడైన నింకను ఎక్కువ పుట్లు ప్రోగుచేసి యధిక లాభము వడయ బ్రయత్నింపడా? కావున రాశియు మూల్యమును అన్యోన్య నిర్ణీతములనుట స్ఫుటంబు.

రాశి, ప్రయోజనము, మూల్యము, శ్రమ ఇవి పరస్పరాశ్రయములు

రాశి, మూల్యము, ప్రయోజనము, శ్రమ అను నీనాల్గును భిన్నములైనను ఒండొంటితో నేకీభవించినవై పరస్పర కార్యకారణ