పుట:Bhaarata arthashaastramu (1958).pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రమ యెక్కువైననే యాశ తగ్గుననగా దానితోడ ఫలంబును అతిశయించిన నాశ యింకను ద్వరలో నంతమొందకుండునా! ఆశ తోడ పూనికయు నస్తమించును. దీనినివిశదీకరించు పటంబు.

పటమున 1, 2, 3 అను భాగములు ఒక్కొక్కటి యొక్కొక గంటసేపు పనిని సూచించు ననుకొందము. రెండుగంటలు పనిచేసిన ఫలము రెండింతలగును. మూడు గంటలకు మూడింతలు. ఇట్లె అన్ని భాగములకును అని గ్రహించునది. రెండును సమముగ వృద్ధి జెందుగాన యధాక్రమాన్వయము గలవని యెఱుగునది.

ఒక గంటప్రొద్దు కష్టించిన పిమ్మట నొకింత ఫలమబ్బును. అప్పటికి బాధ యంతగ దోపదు. ఏలయన ఫలమునందలి ప్రయోజనబుద్ధి (అనగా సుఖము) అధికముగా నుండును.

కాలక్రమేణ వస్తువు జాస్తి కానుగాను దాని యంత్య ప్రయోజనము తఱుగుచు వచ్చును. బాధ యెక్కువయగును.