పుట:Bhaarata arthashaastramu (1958).pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రమ బాధాకరంబు. శ్రమ హెచ్చుపర్యంతము బాధయు బ్రబలించును. సుఖంబుబోలె క్షయవృద్ధుల కిది పాత్రంబుగాదు. ఇందులకు నిదర్శనమగు పటము.

కావున నేదేని పనికి బూనుకొంటిమేని కాలక్రమేణ శ్రమచే గల్గు క్లేశంబుహెచ్చి యా యుద్యమమునందలి యుత్సాహము నంత మొందించును

3. 'కష్టేఫలీ' యను వాక్యప్రకారంబుగ యత్న మెక్కువ యగుకొలది ఫలమును అధికముగ లభించును ఇక బురుష ప్రయత్నము ప్రయాసమునులేకయే ఫలము లబ్బునేని యెల్లరు నన్నివస్తువులును కావలయునని కోరుదువు. తలచిన మాత్రాన వలచినది సమకూరునేని ఆశలకు నంతముండదు. గురువుల నాశ్రయించుట క్లేశముల కోర్చుట అవధానబుద్ధితో వల్లించుట యను నిరోధమును లేనివాడు సర్వప్రజలును పండితోత్తములుగా నుండుదమని కాంక్షింపరా! అట్లేల కాంక్షింపరన, నిన్ని యిడుములం బడవలయుగదా యను భీతిచేతనే. చూడుడు. ఆశల బంధించుటకు వేదాంతమునకైన నీశ్రమయే ప్రబలపాశము.

4. కార్యారంభమున ఫలంబు స్వల్పంబుగ నుండుగాన దానియందు మనకు బ్రీతి యధికముగ నుండును. అందుచే బ్రయాసయు