పుట:Bhaarata arthashaastramu (1958).pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వానినెల్ల దమ యంతరంగ మిత్రులద్వారా తామేకొనుటయు బిమ్మట గొన్నినాళ్ళకు వ్యాపారము గండము దప్పించుకొని మఱల నెదుగుచున్నదని వదంతిబుట్టించి భాగములకు వెలహెచ్చుగా మఱల నమ్ముటయు, నిట్లనేకవిధములైన యింద్రజాలము లంజేసి యన్యాయముగ విత్తంబుల నార్జింతురు.

స్వాతంత్ర్య మఖండముగనుండు నమెరికాలో వీని నడంగద్రొక్కజాలిన వైరిసంఘంబు లేల పొడసూపకున్న వియని యెంచితిరేని దానికి వ్యాఖ్యానం బియ్యది. చక్కెర వ్యాపారములో 3/4 వాసి యొక సంధిసంఘ ముత్పత్తి సేయజాలెనేని దానితో నెదిరించి మానము ప్రాణమును దక్కించుకొనవలయునన్న దానికి సరియైన విస్తారకార్యముగల సంఘం బొండు బయలువెడలినంగాని యపజయము తప్పదు. అట్లు సరియైన సంఘంబొండు వెల్వడెనేని, అదియు 3/4 వాసి సరకు నమ్మకమునకు దెచ్చును. అపుడు గిరాకికన్న 1/2 వంతు సరకు లెక్కువగ నుంటచేత వెలలు వ్రాలినను ఉత్పత్తియంతయు విక్రీతము గాదు. అందుచే రోషాహతాన్యోన్యులై రెండు సంఘములవారుం జెడుదురు. కావున నీసంధి సంఘమ్ము లతో వైరంబుగొనుట దుర్లభంబు. ఇయ్యవి శాసనమ్ములచే నేకేశ్వరత్వంబు వహించినవి గాకపోయినను ననితర సాధ్యంబులుగాన నేకేశ్వర తుల్యంబులే. ఇతరులు వీనిపై దండెత్తివచ్చుట ఆపబడని తంత్రం బైనను నాచరించుటకు నలవిగానిది.

ట్రస్టులచే గలుగజాలిన లాభంబు లెవ్వియనిన

1. గొప్ప గొప్ప సంఘములు సంశ్లేషించుటచే వ్యాపారం బతి విస్తృతంబగును. విస్తారమువలని ఫలంబులెల్ల బడయవచ్చుట.

2. అట్లగుట నిర్వైరంబుగ గార్యంబు జఱుపుట.

3. ఉత్పత్తి వినిమయము మొదలైనవానికి బెట్టెడు వ్యయము తగ్గునుగాన వెలలనుదగ్గించి యమ్మ సమర్థులౌట. ఇక గష్టంబు లెవ్వి యనిన:-