పుట:Bhaarata arthashaastramu (1958).pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. తమ వ్యాపారము వైరుల నిర్జించి నిలిచినదే వెలలు హెచ్చించుట.

2. చోదకులు మొదలగు కార్యజ్ఞులు, ఇంద్రజాలములుచేసి ప్రజలను భాగస్థులను వంచించి వారి యైశ్వర్యము నపహరించుట.

3. చిల్లర వ్యాపారముల స్వాతంత్ర్యమును నేలకు దెచ్చుట.

4. రాజ్యాంగమువారినిసైతము లంచములిచ్చి తమకు వశవర్తులుగ నుండజేయజూచుట.

ట్రస్టుల దౌష్ట్యమును వారించుటకు జేయబడిన క్రియ లెవ్వియనిన

1. శాసన విరుద్ధములని యాదేశించుట. ఇది మంచి చికిత్స గాదు. ఎట్లన, అవి వేషాంతరముం దాల్చి మఱల బ్రత్యక్షమునకు వచ్చును. మఱియు వానియం దనేక గుణమ్ములుండుటచే బొత్తిగా నశింపజేయుటయు నీతిగాదు.

2. మొత్తముమీద జేయదగిన యుపాయములేవనగా, రాజ్యాంగమువారు వీనిని విచారించి పరీక్షించి క్రమము లేర్పఱచుటకు నిష్పక్షపాత్రులును యోగ్యులునైన యుద్యోగస్థుల నియమించుట మొదటిది. రెండవది, వీని స్థితిగతులనెల్లనారసి యప్పుడప్పుడావృత్తాంతముల నన్నిటిని బహిరంగపఱచుట.

ధర్మసంధి సంఘములంగూర్చి సమష్టివాదు లుపన్యసించు ప్రకారము

వర్తమానముననుండు నార్థిక నిర్మాణము లయించుననియు, లయమొందుటమేలనియు, వితర్కించు సమష్టివాదులు, ఈసంధి సంఘములు రాబోవు సంఘనాయకత్వమునకు సోపానములని యాడెదరు.

ఎట్లన:-

1. పణ్యచక్రమునంతయు నాక్రమించినవగుటచే నివి గిరాకి యొక్క స్థితినరసి యుక్తమైనంత ఉత్పత్తింజేయుంగాన నమితోత్పత్తి దోషంబు నివారితంబగును.