పుట:Bhaarata arthashaastramu (1958).pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామాన్యమైన నిక్షేపములకు బ్యాంకీలలో దొరకువడ్డీ 100 కి 4 రూపాయలు. మద్రాసు బ్యాంకీ భాగస్థులకు నేటేట సరాసరికి నిచ్చులాభముయొక్కపాలు 100 కి 12 రూపాయలు.

కావున రాబడింబట్టిచూచిన స్థాపకులు 500 రూపాయలిచ్చి కొన్నవియైనను భాగములు 1500 రూపాయలకు బోవునవిగానున్నవి.

ఈ యుపాఖ్యానముయొక్క యాదేశమేమనిన

ట్రస్టులయొక్క కార్యచోదకులు మర్మములన్నియుం దెలిసిన వారగుట లాభము మఱుగుజేయ బైన్యాయము నూదిన యధర్మ తంత్రం బొండాచరింతురు. ఎట్లన:-

ఒక ట్రస్టులో 10,000 భాగస్థులనియు, భాగమునకు నాదిమ క్రయము 1000 రూపాయలన్నియు, సాధారణమగువడ్డీ 100 కి 4 రూపాయలనియు, వచ్చిన లాభము 100 కి 24 అనియు నను కొందము. ఈ సంగతి బహిరంగమైనచో బోటీసేయుటకునై ప్రతిసంఘము బయలువెడలక మానదు. కావున రహస్య రక్షణము సేయుటెట్లు?

ప్రతిభాగస్థునియొక్కయు భాగము 1000 రూపాయలేకాదు 6000 రూపాయలాయెనని ప్రచురించిరేని లాభము 100 కి 4 వంతున వచ్చినదివలె గన్పట్టును. అవునుగాని యిది యనువైన క్రియగాదు. ఎట్లన సామాజికుల సంఖ్య పెద్దది. 10000. వీరికెల్లరకు నిష్కారణముగ భాగములవిలువ ఇంత యయ్యెనని తెల్పిన నమితలాభము వచ్చినందున నిట్లు చేసిరనువార్త యెల్లెడల వ్యాపింపకపోదు. "పెదవిదాటిన చదలుదాటు" నను సామెతయుండలేదా? పదివేలమందికి దెలిసిన పిమ్మట నది యెట్టిరహస్యము? అయిన నొక్కటి. ఈ రీతిం జేసిన వ్యాపారస్థితి ప్రకాశమునకువచ్చుట తప్పనిదైనను లాభమున గ్రమభాగము భాగస్థులకందఱకును జేరును. కొందఱు చోదకులకు నిర్మాతలకు నియ్యదిగూడ గడుపు నుబ్బజేయునది.