పుట:Bhaarata arthashaastramu (1958).pdf/444

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. అమితలాభము వచ్చుననుట వ్యక్తంబయ్యెనేని చోదకు లూరీతి జింతించుట సహజము. "భాగస్థులీ వ్యాపారము ఫలాఢ్యమౌటకునై యేమిసేసిరి? ఎన్నియో యేండ్లప్పుడు గొంత మూలధన మొసంగిరికాని వారివలననైన యితర ప్రయోజనము లెయ్యవి? రేయనక పవలనక మంత్రాలోచనజేసి కార్యంబుల దగుతెఱంగుల నడపి లాభసిద్ధిని స్ఫుటము చేసినవారము మనముగదా! ఇపుడీలాభములో సమమైన పాలిచ్చుటయేల? వారికి న్యాయముగ నియ్యవలసిన దేమి? సాధారణమగు వడ్డీకి దక్కువగాని యాదాయము. పోనీ! నూటికి 4 వంతుగాకున్న నైదువంతున నిత్తము. చివరకు 6 ఐనను హానిలేదు" అని తలపోసి 100 కి 24 ప్రకారము వచ్చుబడి వుండుటం జేసి యప్పటి సాధారణమగు వడ్డీయొక్క క్రమముబట్టి మూలధనము మతింపువేతురు. అనగా ఆరుతో గుణింతురన్న మాట. మూలధనము యొక్క పరిమాణమెంతయగును? 60,000,000 రూపాయలు. తొలుత నిక్షేపించిన మూలధనం 10,000,000 అది పోగా శేషించిన 50,000,000 రూపాయల నెట్లు నాచుకొందమని కుయుక్తులం గావింతురు. అందొక యుక్తియేదన:-

1. వ్యాపారము మిక్కిలియు విస్తరించుచున్నది. ప్రారంభమున వేసిన మూలధనము చాలదు. ఎక్కువ వేయవలయునని యేమియు దెలియని భాగస్థులకుజెప్పి 30 వేలు క్రొత్తభాగముల నేర్పఱుప వారితో ననుమతిగొని "వీనిని రొక్కమునకు విక్రయింపక" కార్యసాధానమున బుద్ధిబలముంజూపి "సహాయులైన వారికి జీతములకు బదులుగ భాగములనిత్తు" మనిచెప్పి తామును దమమిత్రులును లోలోన నీనూతనభాగముల దమలో బంచుకొనుట.

1. 10,000 భాగములకు సామాన్యమైనలాభము 40,000 కు సామాన్యమౌటచేత నీకపటము తెలియనివారలకు నీవ్యాపారమున లాభమట్టె యెక్కువలేదని తోచును.