పుట:Bhaarata arthashaastramu (1958).pdf/38

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గొప్ప పనులలోను ప్రవేశింతురు. తమకు లాభములేకున్నను బుత్ర పౌత్రాదులకైన మేలుకలిగిన జాలునని కష్టింతురు. అంతటియోర్పు, జ్ఞానము, పరోపకారబుద్ధి మనవారిలో నంతగా గానరాదు. 5. ధైర్యము, కర్మలు, వాణిజ్యము, వీనిలో మూలధనము వినియోగింపవలసియున్నది. ఒకవేళ నష్టమువచ్చి యీ ధనము మునిగిపోయినను బోవును. ఖండితముగా లాభమే కలుగునను నిశ్చయ మేకృషిలోనులేదు. అట్టిపనులకు ధైర్యములేనివారు, నెలనెలకు నియమముగ జీతము లభించుగాన తఱుచు రాజకీయోద్యోగముల నాసింతురు. ఇంగ్లాండులో పట్టపరీక్షలదేరిన విద్యావంతులుసైతము మనదేశములోబలె గుంపులు గుంపులుగా గవర్ణమెంటు సేవలో జొరరు. అపాయమున్నను సంపాద్యము ఎక్కువ గావచ్చునను కోరికచే స్వతంత్ర వ్యవహారవృత్తుల నవలంబింతురు.

ఈ విషయ మిక ముందును జర్చింపబడుగాన నిక్కడ నింకను విపులముగ వ్రాయునవసరము గానము. "ధర్మార్థంబులు పరస్పరహేతువులు" అనుట యీ ప్రకరణముయొక్క ముఖ్యాంశము.