పుట:Bhaarata arthashaastramu (1958).pdf/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

దమదేశమునకును కీర్తికరములగు పనులగావింపనేర్తురా ? మఱియు బూర్వము నిష్కారణముగ రాజసూయార్థము దిగ్విజయము జేయవలయునను పేర జుట్టుప్రక్కలనుండు చిన్న రాజులపై దండెత్తి వారి సంపదలను గొల్లగొట్టి తమబొక్కసము నించుకొనుచుండిన యుధిష్ఠి రాదులను బొగడు మనము యూరోపియనుల నేటికి నిందింతుమో తెలియరాకున్నది. ఈర్ష్యచే మనకున్న నెక్కువగనుండువారిని దూషింపక, ఇది మనకర్మమని మిన్నకుండక, స్వప్రయత్నముచే వారివలె నౌన్నత్యము వహింప జూచితిమేని అదియే మగతనము.

ధర్మమేజయమందురుగదా ? కనుక జయము స్థిరముగ నుండుచోట ధర్మమున్నదనుట కేమిసందేహము ? హిందూదేశమున జయమెన్నడో మాయమాయెను. ధర్మమంతకుమున్నే మాయమయి యుండును. కావున నర్థాభివృద్ధికి నాధారభూతమగు ధర్మమును బునరుద్ధారణ మొనరించి యందుమూలమున జయము సంపాదింప బ్రయత్నింప వలయును.[1]

ఈ ధర్మము నుద్ధరించుటకు దగిన సుగుణము లెవ్వియనిన - 1. కాయకష్టము. 2. యోగ్యత, నమ్మకము. ఇవిరెండును బరస్పర కారణములు. యోగ్యతలేనిదేశములో నమ్మకముండదు. నమ్మకము లేనిచో యోగ్యతయుండియు ఫలములేదు గాన యోగ్యతయు నుండదు. 3. ప్రకృతిశాస్త్రవిచారణము. నీటియావిరి, విద్యుచ్ఛక్తి, లోహములుగలచోటులు, వానిగుణంబులు, మొదలగు విషయంబుల నెంతో శ్రమకోర్చి పరిశీలించినందుననే యూరోపియనులు యంత్ర నిర్మాణమున నిపుణులై యపారమైన వ్యాపారమును నడపు శక్తిగల వారైరి. 4. దీర్ఘదర్శిత్వము. అనగా ముందు విచారణ. ఇంగ్లాండు, అమెరికాదేశములలో ఇంక నూరేండ్లకుగాని ఫలమునియ్యని గొప్ప

  1. ధర్మమనగా యదార్థధర్మముకాని వర్ణాచారములనబడు దప్పుత్రోవలుకావు. వీనింగూర్చిన చర్చకై అధికప్రకరణముం జూడుడు.