పుట:Bhaarata arthashaastramu (1958).pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వృత్తులుద్భవిల్లిన కాలములో మూర్తీభవించెను. దీనింగూర్చి ఆర్థికశాస్త్ర పితామహుండని ప్రఖ్యాతిగన్న 'ఆదాముస్మిత్‌' అను నాంగ్లేయుడు వ్రాసిన ప్రకారము:-

అన్నిపనులను దానేచేసి కార్యంబు పరిసమాప్తి నొందించునేని ఎట్టి కుశలుడైనను దినమునకొక గుండుసూదిని తయారు చేయుట యబ్బురము. ఇప్పటి కాలములో నీరీతిజేయ బిచ్చివాడైన దలంపు గొనడు వర్తమాన వ్యవహారములలో గుండుసూదుల నిర్మాణము, అనేకాంగములుగా విభజింపబడి, ఒక్కొక యంగము నాక్రియయందు మాత్ర మారితేఱినవారగు శిల్పులచే బోషింప బడుచున్నది ఈ విభాగము లెట్లన; ఒకవంక గడ్డీల సాగదీయువారు, ఒకదిక్కు వానిని వంకర లెవ్వియులేక సరళముగా నుండు నట్లీడ్చువారు, ఒకయెడ వానిని సమభాగములుగ గత్తిరించువారు, ఒకవైపున దలల గుదుర్చుటకై కొనలనూరువారు, ఒకదెస దలల దీర్చువారు, ఒకచోట దలల నతికించువారు, ఒకతావున సూదులకు మెఱుగుపెట్టువారు, ఒకస్థలమున వానిని గాగితములలోదూర్చి కట్టువారు, ఇత్యాదులు. మొత్తమునకు పదునెనిమిది యుపకర్మలుగలసిన గుండుసూదులు ప్రవాహముగ బాఱును. శ్రమ విశ్లిష్టమగుకొలది క్రియలును భేధింపబడి, మిశ్రములుగ నుండుటమాని యేదైన నొకతీరగు గమనముచేతనే సాధింప బడునవియగునుగాన, నట్టిచలనముగల యంత్రముల సహాయమును క్రియ లతిసరళములగుడు పడయవచ్చును. మిశ్రగతులు యంత్రములకు నసాధ్యములనియు నొక్కతెఱంగున దిరుగుటయో, మీదికి లేచి వ్రాలుటయో, ముందు వెన్కలకు బోవుటయో, ఇట్టిపనులను పున:పున: చేయుటలో మనుజులకన్న యంత్రము లధిక చతురములనియు జెప్పుట చర్వితచర్వణంబు. యంత్రములును, శ్రమవిశ్లేషమునుజేరిన, పుట్టలోని చెదలకన్న దట్టముగ సూదుల నుత్పత్తిజేయుట యల్పకార్యంబు. పదిమంది పనివారు మాత్రమున్న యొకానొక కర్మ