పుట:Bhaarata arthashaastramu (1958).pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేటాడుట, తలలజెండాడుట, మొదలగు నుద్ధత వ్యవహారముల విహరించెడివారు. ప్రప్రధమంబున దాసత్వసిద్ధినందినవారు కోమలాంగులే. ఆనాటి ప్రచారము లనేకములు పతివ్రతాచారములనుపేర నేటికిని బరుగుచున్నవి. కూలిలేని చాకిరియని యథేష్టముగ దాసీజనమ్ముల బొట్టుగట్టి కట్టకయే మందకు జేర్చుటయు బురాణప్రసిద్ధము. మంగళసూత్రంబు నాబడునది తొలుత వీరింగట్టి గుదించి యుంచుటకై వేయబడిన మంచిమెడత్రాడుగాబోలు! ఒకముడివేసిన విప్పుకొందురోయని మూటికిదక్కువ గాక వేయవలసినదని నియమ ముంటబట్టిచూడ పూర్వికుల పాశుపాల్యాది వ్యవహారనైపుణి మబ్బునుండి వెలువడిన మెఱుంగుదీగవలె సిగ్గువిడిచి యెదుర నిలిచినట్లు కనబడకపోదు.

పశుపాలన మహాయుగంబునుండి యర్థముతో గోరికలు, కోరికలతో వృత్తులు, వృత్తులతో నర్థములును విలసిల్లగా వ్యవహారచక్రము విన్యస్తమై వెంటనంటి వచ్చుచున్నది. వృత్తులును వేఱువడియె. వృత్తి భేదముతో నైరోపాలో శిల్పశ్రేణులును హిందువులలో వ్యవహారజాతులును వికాసముంజెందె. ఈ విషయము లిప్పటికి మీకు ప్రాత కధలు. కావున గ్రొత్తకట్టల విప్పుదము.

క్రియావిభజనమిపు డత్యద్భుతముగ వ్యాపించియున్నది. మన గ్రామముల వడ్రంగి కొయ్యపనుల నన్నియుంజేయును. వ్యాపార పారీణరాజ్యముల నాయొక్క వృత్తి యెట్లుపరిణమించినదో చూడుడు! బండి చక్రములజేయుట, బల్లలు, కుర్చీలు, సోఫాలు వీనిపని. ఇల్లుకట్టు సామానుల దయారు చేయుట, ఇత్యాది వృత్తులు వెవ్వేఱు.

క్రియా పరిచ్ఛేద మింతటితో సమాప్తమా? కాదుకాదు! ఇయ్యది యుదయకాలము. మధ్యాహ్న మింకను ముందున్నది. ఏకవస్తు నిర్మాణమునం గూడ ప్రత్యేకపఱుపదగిన ప్రతియంశమునకును ప్రత్యేక కర్మాంగము లేర్పఱుపబడియె. ఇది సాధ్యమౌటకు నీప్సితసంఖ్య శిల్పులొక్కయెడంజేరుట ఆవశ్యకముగా న నీపరిణతి యావేశన