పుట:Bhaarata arthashaastramu (1958).pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చూడుడు! శ్రమకు మూలధనమునకుంగల సంబంధములు. రెండునుం గలసినగాని యుత్పత్తియు నార్జనమునులేక రెండును గృశించి కీర్తిశేషములౌను. ఉత్పత్తియం దేకీభవించినను ఫలము విభజించు కార్యమున నివి పరస్పర విరుద్ధములు. శ్రమ కెక్కువభాగము జేరిన మూలధనముకు జేరునది తక్కువ. పుంజీదారు లెక్కువ కొట్టివేసి రేని కర్మకరులకు మిగులునది కొంచెము. నీకువచ్చిన నాకులేదు, నాకువచ్చిన నీకులేదు, అను సమాచారముగానున్నది. ఇట్లు తొలుత వియోగమును, వియోగంబు కానుగాను వైరమును ప్రాప్తించి కర్మభర్తలకు గర్మకర్తలకును బ్రబల కలహములు పుట్టు కారణంబాయె. ఇదియు స్పర్ధచేనైన కొఱగామియే యనుట తేటతెల్లంబు.

ఈ యార్థిక యుద్ధమున దేలినవారు కొందఱు. మునిగినవారు పెక్కుఱు. పుంజీదారులు కొల్ల గొట్టువారు. శ్రమకరులు కొల్లపోవువారు. అధిపతు లాస్తిగలవారుగాన బలాఢ్యులు. రథికులవంటి వారు. భృత్యులు పాదచారులైన కాల్బలములు. ఇదివఱలో రథికుల తీవ్రత యాపరానిదై యుండెను. ఇప్పుడన్ననో కాలము, దైవమును బక్షముల మార్చుచున్నవి కాబోలు! పనివారు దృఢవ్యూహములం బన్నినవారగుట మేలుచేయగా నింకను రాకున్నను సరిసమానముగ నిలిచి వ్యాపారసమరంబున నవికలస్వాంతులై యున్నవారు.

దేశభేదములనైన బాటింపక శ్వేతఖండనివాసులెల్లరు, ఈ సంఘముల స్వస్వలాభముంగోరి చేరియుండు టంబట్టి యొకదేశమున జగడమారంభమైన నది యన్యదేశమునకు వ్యాపించుటయుం గలదు. ఈవిషయము నెదుటవచ్చినిలిచినట్లు విశదంబొనర్ప గతసంవత్సరమున*[1] నడచిన యొకటిరెండు భీకరాఘాతముల వర్ణించెదము వినిడు.

ఓడల కంపెనీలవారికిని, సామానులనెత్తుట, దింపుట, ఇత్యాది కర్మలనుజేయు సేవకులకును జీతముం గుఱించిన రాయబారములు

  1. * అనగా 1911 వ సంవత్సరమున ననుట: