పుట:Bhaarata arthashaastramu (1958).pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నసంఖ్యులై యుండుటచే, దేశసౌఖ్యము, అమితమనువ్యాధిచే నపకృష్టమై తపించెడిని సంఘంబనుత్రాసు సరిగా నిలుచునట్లు గానము.

చలములేక యేదేనొకతీరున నితరులకు ధారాళముగ నెడము ప్రోపుల నొసంగిమను మనవారిలో దినదినమును పరమాన్న మారగించువారు లేకపోయినను అంబలియైన లేనివారునులేరు.

5. స్థితిలోనే లయము గుప్తంబై యున్నదను తెఱంగునం స్పర్ధ స్పర్ధచేతనే సమాప్తిం జెందును. ఎట్లన; యుద్ధరంగంబునంబోలె నార్థికరంగంబునను క్షాత్రము శోభిల్లి యొండొరులం బొడిచి యడంచిరేని, ఓడినవారుపోగా జయమండితులైన వారు నిరర్గళ వ్యాపారులగుదురు. ఇయ్యది యనుభవదృష్టము. అమెరికా దేశములో దొలుత సర్వస్వతంత్ర స్పర్ధ విజృంభించి యందుచే ననేకులు కసవుం గఱచిన వారుకాగా నిప్పుడు వ్యవహారచక్రంబులో బహుళ భాగంబండుం గడతేఱిన కొందఱ యధీనముక్రిందికి వచ్చినది. రాష్ట్రములయందెట్లో వ్యాపారముల యందునట్లే. క్రమనియమముల సరకుగొనక రాష్ట్రీయులు గవర్నమెంటే వలదని హద్దుపద్దులేక యమితస్వేచ్ఛులై తిరుగజొచ్చిన బలమఱి శత్రువులపాలై యేస్వేచ్ఛయు లేనివారగుదురు. అమోఘ స్పర్ధయు నాత్మోపహతంబై మోఘంబగును. ఇది విశదమౌటకుం గొన్ని నిదర్శనములు:-

అమెరికాలో "రాకిపెల్ల" రను భూలోక కుబేరుడొక డున్నాడు. అతడాగర్భ శ్రీమంతుడు గాకపోయినను సాహస బుద్ధిబల సంపన్నుడౌట కిరోసెన్ నూనెయొక్క యుత్పత్తి పరివర్తనాది కళలలో నేకచ్ఛత్రాధి పత్యము వహించెను. ఆక్రమబెట్లనిన; నూనెను, ఇనుపకొళాయలగుండ దీసికొనిపోవచ్చుననుట గనిపెట్టి, అయ్యది తానే కల్పించిన తంత్రమౌట నింకెవ్వరును నాపద్ధతి నవలంబింప గూడదని, అమెరికాసర్కారువారి యధికార పత్రికనుబడసి, రైల్వే కంపెనీలవారితో "నాసరకులను తక్కువ వేతనమునకు దీసికొని