పుట:Bhaarata arthashaastramu (1958).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత అర్థశాస్త్రము

మొదటిభాగము - వాంఛాకాండము

మొదటి ప్రకరణము

అర్థాభ్యుదయమునకు ధర్మప్రవర్తన ఆధారము

             గీ. జరయు మృతియులేని జనునట్లు ప్రాజ్ఞుండు
                ధనము విద్య గూర్పదలప వలయు
                ధర్మ మాచరింప దగు మృత్యుచే దల
                పట్టి యీడ్వ బడిన వాడువోలె. -చిన్నయ్యసూరి.

హిందువులమగు మనయొక్క శాస్త్రములు వేయితలల సర్పముల వంటివి. అనగా నవి యేవిషయమును గుఱించియైనను నొకమాటగ బల్కుటలేదు. మఱియేమన్ననో పరస్పరవిరుద్ధములగు విషఘోషలు చేయుచు నల్పబుద్ధులగు వినువారి మనస్సులకు భ్రమగల్పించునవిగా నున్నవి. విమర్శనజ్ఞానములేని మూర్ఖులు గొందఱు సత్యాసత్య విచారణమునకుం జొరక ఇదియునిజమే, అదియునిజమే, ఇంకను ద్రోవబోవువాడేమైన జెప్పిన నదియునిజమేయనియెంచి మూడభక్తియను పంకమున బొరలాడుచు నంతకే కృతార్థులమైతిమని యెంచి తృప్తిజెందినవారై తెలిసినవారు దమ్ముజూచి నవ్వుచున్నారు గదాయను శంకయులేక కాలంబుగడుపుచున్నారు ఇది యెంతయు జింతనీయము. చూడుడు. జనసామాన్యముచే నైదవవేదమని ప్రమాణతమగ్రంధముగా గొనియాడబడు మహాభారతములో అహింసా విషయక ప్రసంగము లనేకములున్నవి. అందు కొన్నిచోట్ల హింసచెడ్డదనియు, మఱికొన్నియెడల నదియంతగా జింతింపవలసిన విషయముగాదనియు, వ్రాయబడివున్నది. అట్లే అర్థంబునుగూర్చియు, సృష్టికి జ్ఞానంబును, స్థితికి నర్థంబును, లయంబునకు దమోగుణంబును ప్రధానంబులని త్రిమూర్తులయు దద్భార్యలయు నామవ్యవహారంబులే