పుట:Bhaarata arthashaastramu (1958).pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కావున నీపురాతన మర్యాద యిరుదెసల వారిక్షేమమునకై వాడుకకు వచ్చినదేగాని బీదల ప్రయోజనార్థమే శాసింపబడినదనుట హుళిక్కి.

మనదేశము అన్నివిధముల యమితములకు నాకరము. ఒకదిక్కున మాలమాదిగెలు కడుపీడ్చుకొని పోవునట్లు ఎండుచున్నారు. ఇంకొకదిక్కున తుమ్మిన మెతుకులురాలునట్లు సంతర్పణములదిని పొట్టలు కదల్చలేక గొప్పవర్ణములవారు కూలబడియెదరు! ఇవి రెండును ఉపద్రవకారులే భోజనము మంచిదన్న మాత్రమున నెంత తిన్న నంతమంచిదని కూరుచున్న లేవక మెక్కజూచుట మౌఢ్యము.

అనగా మిక్కిలి జీర్ణమైన దేహము గలవాడు తినుటకుబూని యొక కబళము మ్రింగజూచిన ఆహారస్పర్శచే హర్షమైనను శక్తిచాలమి. నాహర్షము నంతగా అనుభవింపలేడు. డస్సిన వారికి దొలుత సరళముగ లోపలికిబోవు పాలవంటి ద్రవపదార్థము నియ్యవలయును. సేదదీర్చికొని తినను తినను సౌఖ్యము యథాక్రమమున కన్న నతిశయముగ స్ఫురించును. అనగా పారణారంభమున సౌఖ్య మధికవృద్ధిని గలిగియుండును. కొంతవడికి కుంభకర్ణునికైన నాతురత