పుట:Bhaarata arthashaastramu (1958).pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లాఘవమునొందును. అదిమొదలు సౌఖ్యము హీనవృద్ధి ననుసరించును. ప్రతికబళముదెచ్చు నానందము మునుపటికన్న దక్కువగ నుండును. చిట్టచివరకు తృప్తిసంపూర్ణ మగుడు తినుటయందలి సౌఖ్యం నాసక్తియు సున్నయగును. ఇంకనుం దిండిపోతుతనమున గుడువబూనిన దిండ్లపై బొరలాడ వలయుటయు సంభవించును.

భోజనసౌఖ్యము అనేక సౌఖ్యములట్లు తొలుత నధిక వృద్ధిని తరువాత హీనవృద్ధిని జెందుననుట వ్యక్తము. అనగా ఆరోహణావరోహణములు అనులోమ విలోమములు, అను లక్షణ సంయుతంబు.

ఉచితాహార సౌఖ్యములు లేనివారు చొఱవతప్పి మనపనివారి రీతిని కార్యములం దనాదరమును మాంద్యమును గలవారై యుందురు. ఉల్లాసములేనిది వికాసములేదనుట కిదియొక దృష్టాంతము.

4. ఆరోగ్యకరములైన స్థితిగతులును ఏపునకు దావలములు. మిక్కిలి యుక్కగలిగి గాలిలేని గదిలో నూపిరి యాడుటయే కష్టమన్న గష్టించుట శక్యమా! కర్మశాలలో గాలి శుభ్రముగాలేకున్న బనివారు ఒకవిధమైన మత్తుగలవారై మూర్ఛమునుంగనుండువారివలె నేమియు దోపక జాగ్రత్తతో బాటుపడనేరరు. తమకుం దెలియక యంగములుదూలి భరముతో బ్రయత్నము సాగించుచుండిన దానికిని బుద్ధికౌశల్యముతో గమనించి చేయుపనికిని ఈడుండదు.

ఇంగ్లాండు, అమెరికా, జర్మనీ, ప్రాన్‌స్ ఇట్టి నాగరికాగ్ర గణ్యములైన రాష్ట్రములలో ఇప్పుడు కర్మశాలలను హర్మ్యములట్లు రమ్యముగా గట్టుచున్నారు. కోకో యను పదార్థము శుద్ధిచేసి ఆహార యోగ్యముగానొనర్చు 'కాడ్‌బరీ' యను కుబేరోపముడైన వ్యాపారి కట్టించిన మనోహరమైన 'బోరన్‌విల్‌' అను గ్రామమును నేను కనులారదర్శించి నేత్రసాఫల్యముంబొందితి. ఆగ్రామమెట్లున్నదన; ఇండ్లు చిన్నవియైనను గృహములోని యాయాకృత్యముల కనువైన వెవ్వేఱుగదులుగలిగి ముందఱను వెనుకను రెండుగుంటల తోటనేల