పుట:Bhaarata arthashaastramu (1958).pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వివాహ క్రయవిక్రయములనిలుప మార్గమొక్కటియే. అది మోహము నిలుపుట. అదిలేనిచో గన్యాదానము బేరసారములలో నొక్కటియౌను. కూతులుం గొడుకులును సరకులౌదురు. ద్విజులలో నగ్నికా వివాహము విధిగావున నాడుబిడ్డలుగలవారు ఏగోడులకైన లంచములకైననోర్చి కాలము మీరకుండునట్లు వరునిసంపాదింపజూతురు. అట్లగుట మగబిడ్డలచే దలిదండ్రులకు మంచిలాభమున్నది. అందులకే "అపుత్రస్య గతిర్నాస్తి" యని వైదికులు పుత్రాభ్యుదయమే నిరీక్షించి శోభనమును వేచియుండుట.

మఱికొందఱు "తరుణులైనపిమ్మట పెండ్లి జేయ మనవల్లనగు పనిగాదు. అయినను నాలుగైదేడులలో గాక తొమ్మిది పదిలో జేయించిన కొంతకు గొంతమేలు?" అని వివాహవయస్సు కించిత్తు పొడుగు చేయవలసినదని పారాయణముజేతురు. వరించుస్వాతంత్ర్యము గుణము వీనికి వెలియౌట, అతిబాల్యమునందే బిడ్డలుగనుట, ఇవి యనుచితములైయుండగా వీనికిం బ్రతికారణముగాని కించిద్వయోవృద్ధి యెవరికొఱకు? పరాధిష్ఠిత పరిణయములు పశుకృత్యములని యేమో ఒక్కతూరికి నాహింసచాలునని విధవావివాహములం జాలించిరి. దేహమును ఆజ్ఞలోనికి దెచ్చికొన్నను ఒరులమనస్సు ప్రియముచే దక్క నితరములైన వెఱపుల సాధింపనగునా?

నిర్బంధవివాహము లింత రోతలయ్యును సహజముగ నెవ్వరు సహింపనివయ్యును ఏల వ్యాపకమునకు వచ్చినవని ప్రశ్నింతురేమో. మనదేశములోని యరాజకము, దారిద్ర్యమునే కారణములనుట సదుత్తరము. బీదలు దేహపరిశ్రమ యమితముగ జేయువారుగాన వారికి కాయముతో గూడ మనసును కాయగాచి కఱ్ఱబాఱును, అట్టి వారికి మృగప్రాయములైన భోజన నిద్రాది సుఖములందక్క కోమల రసాన్విత భోగము లున్నవియనియైనం దెలియదు. భోజనముతమ కడుపునిండుగ గోరుదురేకాని రుచుల నాసింపరు. పాపము నిఱు