పుట:Bhaarata arthashaastramu (1958).pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూలధనంబును కానేరవు. ఉదా. చుట్టలు, నస్యము (అమ్మువారికి దప్ప) ఏఅర్త్థమైననుసరే అప్పటికి వినియోగ్యమనియైనను భావిఫలము నిచ్చునదియనియైనను భావింపవచ్చుగాన ఉపయుక్తింబట్టి అర్థములు మూలధనములౌనో కావో యనుట నిర్ణయింపవలయు. "ఇది సదా మూలధనమే. ఇది యెన్నటికి మూలధనము కానేరదు" అని వస్తువుల విభజించుట అసాధ్యము. చుట్టలు, కల్లు, వస్త్రములు ఇత్యాదులు సాధారణముగ గొందఱికి వినియోగ్యములైన యర్థములు గానున్నను వానిని సృష్టించువారికిని విక్రయించువారికిని ఆదాయావహములైన మూలార్థములేకదా!

4. మఱి యన్నివస్తువులును లయమునకుం బాత్రములంటిమి. అట్లైన కల్లునకు ఇల్లునకును భేదమేమి? ఒకటి యరగంట సుఖమిచ్చును. ఇంకొకటి అరయుగము సుఖమిచ్చును. ఏమాత్రము కాలవ్యత్యాసమున్న మూలధన మనవచ్చును? ఒకదినమా వారమా వత్సరమా? యని ప్రశ్నింపవచ్చును. ఈమాత్రమని వ్యవధియేర్పఱుప వీలుకాదు. వాడుకమీద సరాసరికి నిత్యా నిత్య నిర్ణయముం జేయవలెను.

5. అవును! పరిపణము వృద్ధియగుచునేయుండిన అపారమై మూల్యరహితముగాదా? కాదు. ఏలయన పరిపణముతో నాగరికతయు హెచ్చును. నాగరికతతో మనుష్యవాంఛలును ప్రబలును ఒకకోరిక ఆరులోన పదికోరికలు మొలకలెత్తును. అభిమతము లనంతములు. రుధిరాక్షునిదేహమువంటివి. ఒకటి నశించులోన ఇతరములు వేయిపుట్టును. మఱియు ఆశను బంధించుటకు ఆశాపాశమేగాని వేఱొండులేదు. అదెట్లన ఆశను బంధింపవలయునను ఆసలేనిది నిగ్రహంబునకేల తొడంగుదుము? ఏకామమును గూడదనువారు మముక్షుత్వమును వర్జనీయమనరైరి. మోక్షేచ్ఛ ఇచ్ఛగాదా! మఱియు ఫలములయెడ మనసుంచక పనులు జేయవలయునని కొందఱు స్వభావవిరుద్ధమైన