పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంగారపర్ణుడు - గర్వభంగము

3


వ్యాసుని మహదాశీర్వాదమునకుఁ దల్లియు గొడుకులు నమితానంద భరితులై మార్గాయాసంబునుఁ బాటింపక రాత్రులును బగళ్లును బయనము సాగించుచుండిరి.

ఆ ప్రయాణములో నొకనాటి యర్థ రాత్రమునఁగటిశ చీకటిలో దారి తెలియుటకు, మండుచున్న యొక కొఱవి చేతఁ బట్టుకొని యర్జునుఁడు ముందు నడచుచుండెను. తక్కినవారా వెలుఁగులో వానివెనుక వచ్చుచుండిరి. గంగానది యందలి సోమశ్రవంబను పుణ్యతీర్థంబున స్నానము చేయవలయు నని వారి సంకల్పము. అందుచే వారాతీర్థపు మార్గముననే పోవుచుండిరి. వారు గంగను సమీపించుసరికి, భార్యతో జలక్రీడార్థము వచ్చిన యంగార పర్ణుఁడను గంధర్వఁడు పాండవుల పాదధ్వనివిని, యాగ్రహించి విల్లునమ్ములు ధరించి ముందు నడచుచున్న యర్జను నడ్డగించెను. వానిం జూచిన తోడనే యర్జనుడును దక్కినవారుసు దటాలుననిలిచిపోయిరి. అప్పుడంగార పర్ణుండు గంభీరధ్వనితో వారికిట్లనియె. "అర్థ రాత్రములు ను సంధ్యలును, భూత యక్ష దానవ గంధర్వులు సంచరించెడు సమయములు. ఈ రెండు వేళల యందును నెంతటి బలవంతులైన రాజులైన నీ ప్రాంతముల సంచరింప నేరరు. ఇదంతయు నేను విహరించుచుండు ప్రదేశము, నే సంగారపర్ణుండను గంధర్వుఁడను. కుబేరుని సఖుండను. ఈ వనంబున గంగయు నంగారపర్ణయను పేరున నొప్పుచుండు. మీరెవ్వరు ! ఇట్లేలవచ్చితిరి ! నన్నెన్నఁడును మీరు వినలేదా?"