పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

భారతనీతికథలు - రెండవ భాగము

వాని మాటల కర్జునుఁడు నవ్వచు, ఓయీ! గంధర్వా! అర్థరాత్రములయందును సంధ్యలయందు నిందు సంచరించుట కశక్తులుగాని మేమట్లు భయపడము. ఎప్పుడైనను నెచ్చటనైనను మేము స్వేచ్చగావిహరింపఁగలము. మఱియుఁ బుణ్య నదియైన యీ భాగీరథి లోకమునకెల్ల సేవ్యమేకాని, యొక్క నీ సొమ్ముకానేరదు. జననీ భ్రాతృ సహితుండనై నే నిప్పుడు గంగాభిషేకార్థమువచ్చితి. నీవు వలదన్న నుడుగు వాఁడనుగా" నని పలికెను. అప్పు డంగారపర్ణుఁడు క్రోధో ద్దీపిత మానసుండై యట్లయిన నింకఁ గాచుకొమ్మని పలుకుచు నర్జునునిపై నఖండ బాణవర్షమును గురియించెను. చేతంగల కొఱవి ద్రిప్పుచునయ్యమ్ములు తన్నుఁ దాకకుండఁ గాచుకొని పార్థుఁడా గంధర్వునిపై నాగ్నేయాస్త్రమును విడిచెను. అయ్వస్త్రమునుండి వెడలిన పెనుమంట లా గంధర్వుని రథముపైఁ గ్రమ్మి దానిని భస్మ మొనరించినవి. అంగారపర్ణుఁడు నేలగూలి సొమ్మసిల్లి పడియె.

నేలఁ గూలినంతనే యర్జునుఁడు వానిం గొప్పుపట్టిధర్మజాదులకడకీడ్చి తెచ్చెను. అప్పుడు గంధర్వభార్యయైన కుంభీనస బోరన నేడ్చుచువచ్చి, ధర్మరాజు పాదములపైఁబడి, తనకుఁ బతిదానమును గావింపుమని ప్రార్థించెను. కుంతీ ధరనందను లామెనుగరుణించి యోదార్చి యంగారపర్ణుని విడిచిరి. అట్లనుగ్రహింపఁబడిన యా గంధర్వుఁడు ముకుళిత హస్తుఁడై యర్జునున కిట్లనియె. “నీచేతఁ బరాజితుండ నగుటచే నేటి