పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముండె కాబోలును. ఇది లేకపోయిన, దీపములు పెట్టిన తరువాత విశ్రాంతికాలముండెను. ఇతను మాంసభక్షణమాని, శాక భక్షకుడై, తనకు వంటచేయువారి కెంతయు గష్టము గలుగ జేయుచు వచ్చెను. భోజనమునకై యిచ్చుచున్న ద్రవ్యములో సగమే సరిపోవునని బెంజమిను చెప్పినందున, అన్నగా రెంతయు సంతసించి సగమే యిచ్చుచు వచ్చిరి. అతను (బెంజమిను) శాక భక్షకుడైనందున, నీ సగము సొమ్ములో సగము భోజనపదార్థములకు వినియోగించి, మిగిలిన సొమ్ముతో పుస్తకములను కొనుచు, ముద్రాక్షరశాలయందు భోజనము చేసి, విరామ కాలములో వానిని జదువుచు వచ్చెను. ప్రాత:కాలమున వేగముగ లేచి, పనియారంభముకు ముందొక గంటవఱ కతడు చదువుచుండెడి వాడు.



________________