పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురునాధా" అట్టిట్టిదనరానిదై, మహాచోద్యపై, వింతయైనది, నాణెమైనది నాగరికము. అన్నిటియొక్క సముదాయమె యది సముదాయము విడిన, నది లేదు, సముదాయము నిలబడిన, నది యున్నది.

పుట్టినది మొదలు గిట్టువఱకు, దే జాతిభేదములు లేక, ప్రతి మనుజునకు ముఖ్యముగ కావలసిన వస్తువులేవి, నిలుచుటకు నీడ, తినుటకు తిండి, కట్టుటకు బట్ట. ఇవి సమకూడిన మనుజుడు కొంత తృప్తిగ నుండును. మొదట చెట్లక్రిందలలో బ్రతుకుచున్నవారికి, గుడిసెలు, గృహములు, భవనములు, ప్రాసాదములు గాలక్రమమున గట్టినపురుషు లెట్టివారై యుందురు? ఆకు, అలము, దుంపలు, పచనము చేయని మాంసమును దిని బ్రతుకుచున్న వారికి, నేలదున్నుకొని, పంటలను పండించి, వానిని పచనముచేయువిధము నేర్పిన పురుషులొకరో, యిరువురో, మువ్వురో, యెందరో మనకు దెలియదు. వీర లెవరు? దిగంబరులై, కొంతకాలమాకులను, తదుపరి నారలను, మంతోళ్లనుగట్టు, కొనుచున్న వారికి, ట్విడు, మస్లిను, బెనారసు బట్టలను నేయుట నేర్పినవారెట్టివారో, నేర్పినవారో, నిప్పును గని పెట్టినవాడు, దానిని రగిలించు సాధనములను గనుగొనినవాడు. ఈ పురుషులందరు మహాపురుషులు గారా?

ఎందరి మహాపురుషుల యనుధవములను, వారి నామములు దెలియకయే, మన మనుభవించుచున్నాము. వానిని పని యనుధవములని యెంచుటకంటె బుద్ధిహీనత కలదా? ఆ మహాపురుషుల నామములను స్మరించకపోవుటకంటె, హెచ్చు కృతఘ్నత కలదా?

గుండుసూది, దారము, పెన్సలు, కాగితములు మొదలగు వస్తువులలో నేదిలేకపోయినను మనుజునకు వ్యవహారము జరుగదు. ఇవి దిగువయంతస్థులోనివి. షట్చాస్త్రములు, షద్దర్శనములు, ప్రకృతిశాస్త్రములు, ఈ మొదలగు వానిని రచించినవారు, వాని నభివృద్ధినొందించిన వార లెందరో మనకు దెలి