పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యదు. వీనిని నేర్చుకొనుటకు మనుజుని జీవితకాలము చాలదు ఆ మాటకేమి. ఈ రెండంతస్థులలోనివాని సభిన్న సముదాయఫలమును పండితపామరులు, సామంతసంసారులు, పెద్ద పిన్న వారలు, నగర గ్రామవాసులు వీరిలో నెవడు ప్రతిదినము బొందకయుండును.

ఇవియన్నియు సమకూడి, సముదాయ మగుసరికి యెంతకాలముపట్టెనోగదా' వీని సముదాయమె సంఘము కొంతకాలమునకు సాంఘిక సూత్రము లల్లబడి, వర్ణాశ్రమ ధర్మములు విభజింపబడెను. సాంఘికుల మైనంతవఱకు, మనము వీని శుభాశుభ ఫలముల ననుభవింతుము. సంఘమునకు శుభఫలము నిచ్చువారు మహాపురుషులు, అశుభఫలము నిచ్చువారు నీచులు. అనేక సంఘములు గలిసిన, దేశవాసులగుదురు, వీరినే మహాదేశీయులని పిలిచెదరు. శరీరమునం దెక్కడ వ్రేటుతగిలినను, దానికి బాధకలిగినవిధమున, మనము చేసిన యశుభకార్యఫలములను మన సంఘమువారే కాదు, మన దేశీయులు సహిత మనుభవింతురు. యుక్తాహారవిహారముల చేత బోషింపబడినందున, రక్తముధారాళముగ నాళములయందు బ్రవహించి, కర్మేంద్రియములకు ---, జ్ఞానేంద్రియములకు సైర్మల్యము గలుగ జేసినపుడు, శరీరము సుఖమనుభవించునటుల, సంఘములో బ్రతిమనుజుడు భిన్నముగజేయు శుభకర్మము లతనికిమాత్రమె గాక సంఘమునకును దేశమునకును అంతటికిని శుభంబు లొసంగును.

ఈ శుభాశుభ కార్యములు సజ్జన దుర్జనులచేత జేయబడి, సంఘములను దేశములను ఉద్ధరించుటయో యధోగతిపాలు చేయుటయో జరుగును. ఈ గతుల ప్రదర్శనమే దేశచరిత్రనాంబడు దేశములోనివారె సజ్జనులు, దుర్జనులు. భిన్నముపైని 'పురుషుల జీవిత చరిత్రము' లని, సముదాయము పైని 'దేశచరిత్ర' యని, మన మొకదానినె ద్వివిధముగ జూచుచుందుము.