పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాలిఖిత గ్రంధమునుజూచి శాంతముతో సంస్కరించినందుకు, నాగురువులు శ్రీ వేదమూర్తులయిన బ్రహ్మశ్రీ భళ్లమూడి దక్షిణామూర్తిశాస్త్రిగారికిని, సారిపాక నర్సింహశాస్త్రిగారికిని వందనములు చేయుచున్నాను. చిత్తులు సవరణలతో గూడిన లిఖిత పత్రములనుజూచి వానిలో గొన్ని పత్రములను స్ఫుటముగ వ్రాయుటలో దోడ్పడిన నాప్రియ స్నేహితులు మ. రా. రా. చిలుకూరి నారాయణరావుపంతులు బి. ఏ. గారి నభినుతించుచున్నాను. నాముఖ్య స్నేహితులు మ. రా. రా. ఉలుగుండం వెంకటనర్సుపంతులుగారు గానరూపమైన స్తవమునకు రాగము, తాళము సరిపెట్టినందుకు వారిని సన్నుతించుచున్నాను. నా ప్రాణస్నేహితులు మ. రా. రా. గా. హరిసర్వోత్తమరావుపంతులు ఎం. ఎ. గారు దీనికి మెఱుగుబెట్టి వన్నె తెచ్చినందుకు వారిని సంస్తుతిజేయుచున్నాను. "విజ్ఞానచంద్రికామండలి"వారు దీనిని స్వీకరించుటచే దీనికి గురుత్వము వచ్చినదని నాభావము. వారీగ్రంథము నతిత్వరితముగ ముద్రింపించి ప్రచురింపినందుకు వారికి గృతజ్ఞతా పూర్వకముగ నభివందనములిడుచున్నాను.

ఇట్లు
విధేయుడు
గ్రంథకర్త.

గంజాం జిల్లా.

శ్రీకాకుళం

22-5-1913