పుట:Balavyakaranamu018417mbp.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తుత్తుమురు, తుత్తునియలు, మిఱుమిట్లు ఇత్యాదులెఱుంగునది.

43. చేత తోడ వలనల కిత్వంబు సమాసంబులం దగు.

నీచేతన్‌ ... ప్రోపు ... నీచేతిప్రోపు

నాతోడన్‌ ... చెలిమి ... నాతోడిచెలిమి

నీవలనన్‌ ... భయము ... నీవలనిభయము

44. అంద్వాదుల కలిగాగమంబు సమాసంబునం దగు.

నాయందున్‌ ... కరుణ ... నాయందలి కరుణ

ఇందున్‌ ... జనులు ... ఇందలిజనులు

ఎందున్‌ ... వారు ... ఎందలివారు

ఎందు శబ్దమున కలిగాగమము కొందఱు లేదండ్రు.

45. అది యవి శబ్దంబుల యత్తునకు వృత్తిని లోపంబు బహుళంబుగ నగు.

నా ... అది ... నాది, నాయది

నా ... అవి ... నావి, నాయవి

ఉదంతములగు తద్ధర్మ విశేషణంబులకు మీఁద లోపంబు లేదనియు నిదంతంబులగు తద్ధర్మ విశేషంబులకు మీఁద నిత్యంబనియు బహుళగ్రహణముచే నెఱుంగునది.

వచ్చునది - వచ్చునని, వచ్చెడిది - వచ్చెడివి.