పుట:Balavyakaranamu018417mbp.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46. పడ్వాదులు పరంబులగునపుడు మువర్ణకంబునకు లోపపూర్ణబిందువులు విభాష నగు.

భయము ... పడె ... భయపడె, భయంపడె, భయముపడెను

సూత్రము ... పట్టె ... సూత్రపట్టె, సూత్రంపట్టె, సూత్రముపట్టె

ఈ కార్యము కర్తృవాచి మువర్ణకమునకుఁ గలగదు. గజము పడియె, అశ్వము పడియె.

47. మధ్యమపురుష మువర్ణకంబునకు హలవసానంబులు పరంబులగునపుడు లోపము విభాష నగు.

చూడుము ... నన్ను ... చూడునన్ను, చూడుము నన్ను

ఇటు ... చూడుము ... ఇటుచూడు, ఇటు చూడుము

చూడుమనియె, వినుమనియె. ఇచ్చట నచ్చు పరంబయినది. కాబట్టి లోపములేదు.

48. వ్యతిరేక మధ్యమ మువర్ణకంబున కెల్లయెడల లోపంబు విభాష నగు.