ఈ పుట అచ్చుదిద్దబడ్డది
లు మెండుగాఁ గలవు. వానినన్నిటిని దిద్దుకొనవలసిన భారము మీయందెయుంచితిని, ఇందున సంస్కృతాంధ్రారోగ్య విషయముల గుఱించి వ్రాయుచుఁ గవికాలాదులఁ దెలియఁబఱచి యున్నారు. అవియె సిద్ధాంతములని వ్రాయలేదు. నాకీగ్రంధమును రచించుఁడని ప్రోత్సహించినవారికి, నాకబ్బమునకుఁ దోడ్పడిన పూర్వాధునికగ్రంధ కర్తలకు, సచ్ఛ్రేయోభిలాషు లగు మిత్త్రవరులకుఁ గృతజ్ఞతాపూర్వక వందనము లాచరించుచు నాయుపోద్ఘాతమును ముగించు చున్నాను.
కం॥ తప్పుల నొప్పుల నెఱుఁగక
యెప్పగిదినొ చెప్పినాడ నిందలితప్పుల్ ।
దప్పక మన్నించుచు మీ
రొప్పులెగ్రహియించమీకు నొరిగల్ జేతున్ ॥
8 - 1 - 1911
బుధజన విధేయుఁడు
శికిందరాబాదు
చివుకుల అప్పయ్యశాస్త్రి.