శ్రీశారదాంబాయనమః
ఉపోద్ఘాతము.
కోవిదులారా!
ప్రస్తుతకాలమున వచనగ్రంధ నికరమె కించిజ్ఞుల కెక్కువ యుపయోగకారియని ప్రాజ్ఞులు పలుకుచున్నారు కదా. తత్కారణముననె హైదరాబాదు గవర్ణమెంటు హైస్కూలుసహా యాంధ్రాగ్లోపాధ్యాయులగు మ॥ య॥ నరసింహశాస్త్రిగారు విద్యార్థులకు నీతియుతములగు పూర్వకథలను దృష్టాంతీకరించుచు భాషాభివృద్ధిఁ గలుగఁ జేసెడి చిన్నకబ్బ మొకదానిని రచించుఁడని నాకుఁ బ్రోత్సాహముఁ జేసిరి. దాని నేనంగీకరించి భారత భాగవత రామాయణాదులనుండి కధలను గైకొని సంగ్రహముగా వ్రాయుచుఁ బ్రస్తుతమున ముప్పదివిషయములను వ్రాసితిని. కాన విచక్షులగు మీరశీగ్రంథమును దయతోఁ బరిసీలించి విద్యార్థులకు, మరియు సామాన్యుల కుపయోగ పడునటులఁ జేయవలయునని ప్రార్థించెద.
నేనీ ముద్రాక్షరశాలకు మిక్కిలి దూరగుడనగుటచేత దీనిని ముద్రించుటయందుఁ జాలతప్పులు దొరలినవి. వానిలో ముఖ్యములైన తప్పులను దిద్ది యింకొకచో ముద్రింపించి యున్నాను. ఇంకను రేఫశకట రేఫార్ధాను స్వారాదివ్యత్యయము