పుట:Bala Neethi.pdf/61

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు

43

బా ల నీ తి.

బెట్టి కుశలప్రశ్నములజేసెను. అత నాకుచేలుడు తన మనమున స్నేహితుడొనరించిన సపర్యకు సంతొషించి యానందబాష్పములవిడిచెను. అంత నిద్దఱు తాము గురునిసమీపమునజరిగిన సంగగులు జెప్పికొనుచు గాలముగడుపుచుండిరి. అంతగృష్ణుడు తనస్నేహితుడు తనసమీపమున కెందులకువచ్చినది తెలిసికొని "యాతనిమనొరధము సంపూర్ణముగా నెఱవేఱుగాక" యని స్నేహవత్సల్యమున "మిత్త్రమా! నెచ్చెలినని నాకేమైన కానుకదెచ్చితివా? యని యడుగుచు నతనియుత్తరీయమును బులుకుచు నొక కొంగున నటుకులుండుట జూచి ప్రీతితో దానందు గొంచెముతీసికొని మిగిలనవి తనసతులకిచ్చెను. అంతట నాకుచేలునికభ్యంగనస్నానంబుజేయించి మృష్టాన్నమిడి మంచిబట్టలనొసంగి యాతనిని బహుమానపూర్వకముగా వీడ్కొలిపెను.

పరికించితిరా! ఆశ్రీకృష్ణుడు సజ్జనుడగుటవలననె కదా యాకుచేలుడు బీదవాడనియు దనతో సమానుడుకాడనియు దలచక యెప్పుడో బాల్యమున జేసినస్నేహమునుమాత్రమే పురస్కరించుకొని యట్లాతనిని గౌరవించినది. ఆకుచేలుని నెంతసంతోషపెట్టేనో చూచితిరికదా? ఇటులనతడాకుచేలుసంతోషపెట్టుటకు గారనమేమి? బాల్యస్నేహమేకదా. కాబట్టి స్నేహముతో సమానమైన దింకొకటి మంచిది లేదని చెప్పవచ్చును. అందున సజ్జనసహవాసము ముఖ్యమూదుర్జనసహవాసము త్యాజ్యము. కావున మనము దుర్జనసహ