పుట:Bala Neethi.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

47

బా ల నీ తి.

పిల్లలా ఇతరులబిడ్డలజూచి వారివలె మాకునుజేయు డని నన్నుదంటాలు పెట్టుచుండిరి. దారిద్ర్యమా యమితముగానుండె. నేనామీకుజెప్పునంతదానను గాకపోతిని. చెలిమియా మీకు శ్రీకృష్ణునితోడనయ్యె, కాన నార్తజనవత్సలుడగు నాకృష్ణునియనుగ్రహమున మనదారిద్ర్యమును బోగొట్టినన్నీభాధలనుండి తప్పింపు "డని దీనముగా బ్రార్దించెను. అంతట నాకుచేలుడు తనసతియొక్క దీనస్వరమునువిని తపముచాలించి "దారిద్ర్యముబాపుకొనుటకై భగవదవతారమును, నాబాల్యస్నేహితుడును నగు నాశ్రీకృష్ణుని సందర్శించి వచ్చెదను. రిక్తహస్తములతో నేగగూడదు. కాన పండో, పూవో, నీరో, యేదియోపుచ్చుకొనదగిన యొక వస్తువు ను దెచ్చి యి"మ్మని యడిగెను. అంత నామె సంతసమందుచు నటుకులనాతనిచినిగినయుత్తరీ యపు గొంగునగట్టి ముడివేసెను. అంతట నతడట నుండి బైలుదేఱి యాశ్రీకృష్ణమూర్తి యింటిబహిద్వార మును బ్రవేశించెను. అచటనుండి కావలివాండ్రందఱు చినిగిన బట్టలగట్టి సన్నగానుండిన యీకుచేలునిజూచి పకపక నవ్వుచుండిరి. అత్తఱి లోన శ్రీకృష్ణుడు తనప్రియు రాండ్రతో సరస సల్లాపములాడుచు దూగటుయ్యలపై నూగుచు సుఖంబుగానుండెడిసమయమున యాదృచ్చికముగా దనబాల్యస్నేహితుడగుకుచేలుని జూచెను.అంతటనుయ్యెలనుండి దిగి యెదురేగి యాతనిని గౌగిలించుకొని చేయిపట్టుకొని తీసికొని వచ్చి యాయుయ్యెలపై గూర్చుండ