పుట:Bala Neethi.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
17]

120

బా ల నీ తి.

ముఖ్యాభిప్రాయము, కాన మనము దుర్మార్గగుణములున్న నవి విడిచిపెట్టి సన్మార్గమవలంబించి దుర్మార్గసంసర్గమును విడనాడి సన్మార్గులసహవాసము జేసిజననుతులమగుచుందము.

క. తగునిదితగదని యెదలో
   వగనక సాధులకు బేద♦వారలకెగ్గుల్
   మొగిజేయు దుర్వినీతుల
   కగు నని మిత్తాగమంబు♦లైన భయబుల్.

(భారతము)

సత్ప్రవర్తనము.

 మంచినడవడి కలిగియుండుటయెసత్ప్రవర్తనమనబడు. 
   ఈసత్యప్రవర్తనగలిగినవారికి బనులన్నియు ననుకూలించును. వీరితరులకు వంద్యులుగాగలరు. పరోపకారధురీణులునుగాగలరు. ఈసత్ప్రవర్తకులకున్న సౌఖ్యము లొరులకుండవు. కాబట్టి ప్రతిమనుజుడు సత్ప్రవర్తనగలిగియుండవలెను.
   లోకమున బ్రతివాడును, తానుసద్గుణములుకలవాడనియు, దాజేయుచున్నపనులన్నియు, దానుసత్ప్రవర్తకుడనియు దలచుచుండును. కానియిదియసంగతము. ఎట్లన? దొంగ, తానుచేయు దొంగతనము మంచిదనిత