పుట:Bala Neethi.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
128

బా ల నీ తి.

ను. తుదకీదుర్మార్గములవలననే యారావణుడు శ్రీరాముల వారిచే మృతిజెందవలసివచ్చెను.

     చూచితిరా! ఆరావనాసురు డావిధముగా దుర్మార్గ కార్యముల నొనరించుటవలననె కదా వాడావిధమగు హానిని బొందినది. కాబట్టివిషవిరాజితమూర్తులై గర్హులైన యీదుర్మార్గుల మనముముందరి జేరనీయగూడదు. సంభాషణసేయగూడదు. "దుష్టందూరేచవర్జయే" త్తన గాదు దుర్మార్గునిదూరమునందె విడువవలయునని యర్దము. కాన మనకాకుమతులను దూరమునందే యుంచవలెను. మఱియు వారితో నెక్కువశత్త్రుత్వము న నుండరాదు. మిత్త్రత్వముతో బొత్తుగానుండరాదు. ఆదుర్జనులతో మనకత్యంతావసరము కలిగినప్పుడు తాత్కాలిక స్నేహమాచరింపవలెను. ఎక్కువ చెలిమి జేయగూడదు. చేసినదప్పక బాధకలుగగలదు. తమలపాకున సున్నమిసుమంతవేసినబాగుండును గాని యెక్కువవేసిన నాలుకబొక్కి కీడుగలుగ జేయదా?  కాన నెక్కువస్నేహముపనికిరాదు. ఈశుమతులతొ సహవాసముచేసినయెడల మనము కూడ వారితోపములకాగలము. కుజనసహవాసము వలన దొషములలవడుననియు, సుజనసహవాసము వలన సుగుణములు కలుగుననియు నిదివఱకె చెప్పి యుంటినిగదా. అదిగాక సుజనుల తోడ గలహము పెట్టుకొనుటయైనను మచిదికాని చెడుగులతో జెలిమి జేయుట జేటని మనయార్యులు నొక్కిచెప్పిరి. అనగా దుర్జనమైత్రి యెంతమాత్రము మంచిదికాదని వారి