పుట:Bala Neethi.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
116

బా ల నీ తి.

క. కలిమియచుట్టల జేర్చుం
    గలిమియ చెలులనుఘటించు♦గలిమియశౌర్యో
    జ్ఝ్వలుడనిపించుచుం గలిమియ
    పలువురు సద్బుద్ధియనగ♦బరగంజేయున్

)(భారతము)

ఐ క మ త్య ము

   జనులొకపనియందున భిన్నభావములులేక చేరికగా నుండుట యైక మత్యమనబడు.
     ఈయైకమత్యము పరస్పరప్రేమ గలిగించుచుండును. ఇదియె దిగంతములగీర్తిని వ్యాపింపజేయుచున్నది. ఇదిసర్వత్ర సాధకము. కాన దీనిని దప్పక జనులవలంబించవలయును. కాని యీయైకమత్యమును మంచిపనులయందె యుపయోగించుచుండవలెను. అటులజేయుట యేశ్రేయస్కరము. ఐకమత్యములేనివారలు మహా పరాక్రమశాలులైనను గొనరాని వారుకాగలరు. మనమైకమత్యముకలిగి యుండనిది యేపనిని చేయ జాలము. మనమువిస్తరియందునబువ్వనుంచుకొని మనచేతివ్రేళ్ల నొకచోట జేర్చనియెడల మనమా యన్నమును భుజించగలమా? లేము. కాబట్టి ప్రతివిషయమునను నైకమత్యముకావలయును.