పుట:Bala Neethi.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

117

బా ల నీ తి.

    ఈయైకమత్యముననున్నదమ్ములను, దండ్రికొడుకులను నత్తకోడండ్రును, భార్యాభర్తలును, మఱియునింటిలోనివారందఱును గలిగియుండిన యెడల గృహమున గలతలు లేక గృహకృత్యముల జక్కగానడుపుకొనగలరు. వారలకు దమగృహమె భూతలస్వర్గముగా నొప్పుచుండును. ఈయైకమత్యము గలిగినవారిని నితరులెంతమాత్రమును భాధింప జాలరు. కానబ్రతివాడు నీయైకమత్యమును గలిగి యుండవలెను.

      "ఉహ్హ" యనియాడినంతమాత్రమున నూరుదాటి పోవునంత బలగముగలిగినవారలు కొందఱైమత్యముతో  నుండినయెడల వారలే జగజ్జెట్టినిగూడనోడించి తమకాళ్లబట్టుకొనునటుల జేయగలదు. అల్పమగు కొన్ని గడ్డిపోచలుకలిసి బలిష్టమగునొకయేనుగునుబట్టి కట్టివేయుచున్నదికదా  ఈయైకమత్యముకలిగిన వారలు బలములేనివారైనను నొకపనియందొకటె యభి ప్రాయము కలిగియుండిన వీరాపని యెంత గొప్పదైనను జిటికలోదానినిజేసి కృతార్దులుకాగలరు.
    ఇట్లైకమత్యముతో నల్పబలులు గొప్పపను లొనరించి కీరితిని గడించినవారుకలరు. వారలలో నొక సమూహమును జూపించుచున్నాను.
      తొల్లి వానరు లల్పబలము కలవారైనను జాలమంది యొకటిగాజేరి యగాధంబగుసముద్రము పై గట్టవేసి లంకకు మార్గమేర్పరచిరి. అటుతరువాత రామకార్యార్దమై లంకాపట్టణముజేరి మిక్కిలి బలము గలవారును, బగలుచూచినరా