పుట:Bala Neethi.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
98

బా ల నీ తి.

ణములవలె నెఱ్ఱ జేయుచుండును. అస్తమించు సూర్యునిపగిదిముఖము నెఱ్ఱబాఱ జేయును. తోకదొక్కిన త్రాచుపామువలె బుస్సలుకొట్టించును. కుక్కవలె మొఱగించుచుండును. కోతివలె జెంగుచెంగున గంతుల్ వేయించుచుండును. ఏనుగు తొండమువలె నిట్టటు జేతుల ద్రిప్పించుచుండును. పెద్దపులివలె దుమికించుచుండును. పటపట పండ్లు గీటించుచుండును. తులువమాటాలాడించును. అనృతముల నాడించును. తుదకు దెబ్బలాటకు బురి గొల్పును. ఆసమయమున నీకోపమునకుండు శక్తి మఱియొకదానికి లేదు. ఈకోపము మోహము జెందించును. మోహము బుద్దియందు భ్ర్రాంతిగలుగ జేయును. ఆభ్రాంతిక్రమక్రమముగా బుద్ధిని నాశనమొ నరించును. బుద్దినాశనమైనవాడు నశించగలడు. కాన నీకోపముచేయుచుండు చేడుగుపనులను వర్ణించుటకు వేనొళ్లు గలచిలువకైనను దరముగాదు. ఇట్టి క్రోధము కలిగినవారిని క్రుద్దులని చెప్పెదరు.

     ఈముంగోపులు బుధులైనను జంకక దుష్కార్యములు జేయగడంగుదురు. ఇటుల వీరాచ రించుటవలన సజ్జనులకు బూజ్యముగానేరద్. కాని యీబుధులొకరి పరి కోపము జెందినపుడు సజ్జను డొకడాతనిజేరి మీరిటులాచరించగూడదు. కాన నూరకుండుడని బోధించిన వారీతని మాటవిని కలహ మాడక యూరకుందురు. అటులనె సజ్జనుడు చని దుర్మార్గునికి జెప్పినవాడు మఱింత కినుకమానును. కాని మిన్న