పుట:Bala Neethi.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
1. ]

97

బా ల నీ తి.

లు కలిగియుండినయెడల వారివిద్య పాడగుహ. ధనవంతులీ గర్వమును గలిగియుండిన వారు తమ ధనమును వ్యర్దముగా వ్యయ మొనరించుచుందురు. విద్యాంసులు దీనిని గల్గియుండిన వారికుదుగౌరవము నాశనమగును. వేయేల? ఎవనికైన నీగర్వము కష్టము గలిగించుననియె యని నమ్ముడు. ఎంతయబివుద్ధి యగుచుండిన నంతతగ్గియుండ వలెనుగాని నిక్కి యుండ గూడదు. అటులున్నవరలె లోకోత్తర సత్పురుషులు కాగలరు. కాన మనమహంకారము విడనాడి వినయముగా నుండుదము.

క. గరువము గలిగిన మనుజుడు
    కరముగ నలజడుల బొందు♦గానన్ దానిన్
    సరసర విడుచుచు వినయము
    సరుసమునన్ బొందవలయు♦నధికుండైనన్.

కో ప ము.

కోపమనగా నొకరిపై గినుక జెందుటయె?

     ఇది గర్వమువలన గాని, తనపని కొనసాగన పుడుగాని యితరులు చేయరాని పనుల జేసినపుడు గాని జనించుచుండును. పాము కఱచినవిషము క్రమక్రమముగా నాశరీరమంతయు వ్యాపించినటుల నీకోపము వృద్ధిజెందుచుండును. అంత నిది మనుజుల గ్రుడ్లను ప్రత్తి కాయలవలె జేసి యగ్నిక