పుట:Bala Neethi.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
94

బా ల నీ తి.

లున జనుచుండును. ప్రతిసుందరస్త్రీయును తన్ను జూచిమోహముచెందుచున్నదని భ్రాంతిబడజేయు చుండును. డంబము కొఱకై ధనమును వ్యయము జేయించు చుందురు.

   మిత్రులారా! ఒక్కొక్కగరువ మెంతనష్టము కలిగించు చున్నదో కనుగొంటిరికదా. ఇక నీనాలుగు నొకచొ గలిసి పనిజెయుఛుండిన నికేమిసెప్పవలెను? చెప్పవలను పడని దురవస్దల ఘటించునుగదా. ఇట్టిగర్వముగలిగిన వారలను గర్వులని యనెదరు. వీరు మొదట దమతో సమానులుమాత్రము కొందఱుగలరని తలుచుదురు. అటుపై దమతో సమానులుకాని తమకంటె గొప్పవరలు కాఇ లేరని యెంచుదురు. అంతట నీభూలోకమును గూడ మేమేసృజించితిమని యనుకొనుచుందురు. ఆహా! ఏమి! ఈయహంకారుల మహిమ! భగవంతుని గూడ నిరసించుచున్నారుకదా. ఈయహంకారు లితరులను బ్రేమింపరు. ఇతరులచే దాము బ్రేమింపబడరు. డంబమునకై లేనిపోని చేతగానిపనులనెత్తిని వేసికొని తన్నుకొనులాడుఛుందురు. వీరవమానములబడు చుందురు. యుక్తాయుక్తవిచారణలేని యీగర్వులు మనీషులకు గర్హ్యులు కాగలరు. ఈయహంకారు లది వఱకున్నగౌరవముకూడ నీగర్వముచేత గోల్పోవు దురు. మఱియు వీరి ప్రాణములకు హానియుగూడ సంప్రాప్తించగలదు.
    ఇటుల గర్వమువలన బ్రాణహానిని బొందినవారును